Posted on 2025-07-09 12:20:51
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బి. వై. నగర్‌లోని కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో ఈ రోజు మనో వికాస సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ పాల్గొని, కుటుంబ సమస్యల పరిష్కారం గురించి విలువైన అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ –
‘‘ఈ కాలంలో భార్యాభర్తల మధ్య వివాదాలకు ప్రధాన కారణం పరస్పర అర్థం చేసుకోలేకపోవడమే అని అన్నారు.
ప్రతి వ్యక్తి యొక్క భావాలు, ఆలోచనలు, అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయని తెలుపుతూ అవి గమనించి గౌరవించే దిశగా ప్రయత్నించకపోతే కుటుంబంలో కలహాలు వస్తాయని అన్నారు.
ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని అన్నారు.
ఫ్యామిలీ కౌన్సిలింగ్ వల్ల లాభాలను గురించి పున్నంచందర్ వివరిస్తూ
పరస్పర అర్థం చేసుకోవడం పెరుగుతుందనీ తెలుపుతూ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే విధానాన్ని నేర్చుకుంటారని అన్నారు.
సందేహాలు, అపోహలు తొలగి నిజమైన భావాలను వ్యక్తీకరించే వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
ఓర్పు, సహనశీలత పెరిగి కోప పడకుండా సానుకూలంగా స్పందించే నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
తీవ్రమైన వివాదాలు తగ్గి , చిన్న విషయాలను పెద్దగా చేసుకోకుండా సమస్యలను నిర్మాణాత్మకంగా చర్చించటం అలవడుతుందని తెలిపారు.
ఆత్మవిశ్వాసం పెరిగి , వ్యక్తిగత సమస్యల్ని కూడా ఎదుర్కొనే ధైర్యం వస్తుందని అన్నారు.
సంబంధాలు బలపడడం వల్ల విడాకుల దశ వరకు వెళ్లే అవకాశం ఉండదని అన్నారు.
అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గి, మనశ్శాంతి పెరుగుతుంది తెలిపారు.
"సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కోవడం, మాట్లాడుకోవడం, పరిష్కారం వెతకడం చాలా అవసరం అని తెలిపారు.
ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒక దిశానిర్దేశం మాత్రమే కాదు, అది కుటుంబ జీవితం పునరుత్తేజం పొందే ఒక సానుకూల మార్గం." అని వివరించారు.
ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం మైండ్ కేర్ సెంటర్ లో తమను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ పలువురు మహిళలు, కార్మికులు పాల్గొన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >