| Daily భారత్
Logo




భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన భార్య

News

Posted on 2025-07-17 10:33:43

Share: Share


భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన భార్య

డైలీ భారత్, పశ్చిమ గోదావరి:ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో మరో వివాహేతర సంబంధం బయటపడింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. భార్య, ఆమె బంధువులు ఓ ఓ మహిళను స్తంభానికి కట్టేసి చితకబాదిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళను భీమవరం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

సుబ్బారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు మోగల్లు గ్రామంలో నివాసముంటున్నారు. సుబ్బారావు అదే గ్రామానికి చెందిన మరో ఒంటరి మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం పక్క మండలమైన అత్తిలిలో అద్దెకు ఇల్లు తీసుకుని ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా దుబాయ్‌లో ఉన్న తన కుమారుడు పంపించిన డబ్బులు, ఇతర ఆస్తి పత్రాలు మొత్తం ఆమెకు ఇవ్వడంతో భార్య, భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

దీంతో దంపతులిద్దరూ గత కొంత కాలంగా గొడవలు పడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సుబ్బారావు కుటుంబ సభ్యులు, పెద్దలు అనేకసార్లు అతడి మందలించారు. అయితే సుబ్బారావులో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన భార్య, కుటుంబ సభ్యులు బుధవారం అత్తిలికి వెళ్లారు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటున్న భర్త సుబ్బారావుని, ఒంటరి మహిలను గ్రామానికి తీసుకొచ్చారు. 

అనంతరం ఊరిలోని గుడి వద్ద ఉన్న స్తంభానికి ఆ ఒంటరి మహిళను కట్టేసి చితకబాదినట్లు సమాచారం.  ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు గ్రామానికి చేరుకుని ఆ మహిళను విడిపించి హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన సుబ్బారావు భార్యతో సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >