| Daily భారత్
Logo




వ్యభిచారం కోసం ప్రియురాలిపై ఒత్తిడి.. ఒప్పుకోలేదనీ హత్య

News

Posted on 2025-07-17 10:59:56

Share: Share


వ్యభిచారం కోసం ప్రియురాలిపై ఒత్తిడి.. ఒప్పుకోలేదనీ హత్య

డైలీ భారత్, అంబేద్కర్ కోనసీమ జిల్లా: వారిద్దరి కులాలు, మతాలు వేరు వేరు. అయినా పెద్దలను కాదని ప్రేమించుకున్నారు. అనక ఓ అద్దె ఇల్లు చూసుకుని కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్ధలు రాసాగాయి. ఈ క్రమంలో ప్రియుడి నీచ బుద్ధి బయటపడింది. వ్యభిచారం చేసేందుకు ప్రియురాలిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్‌కు చెందిన షేక్ షమ్మ (22) అనే యువకుడితో ఓలేటి పుష్ప(22) పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. గత కొంతకాలంగా బీ .సావరం గ్రామంలో ఇల్లు అద్దెకి తీసుకొని సహజీవనం సాగిస్తున్నారు. అయితే కొంత కాలం సవ్యంగానే ఉన్నప్పటికీ.. క్రమంలో మనస్పర్ధలు రాసాగాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రియురాలు పుష్పను షేక్ షమ్మ వ్యభిచారం చేయడానికి నా వెంట రావలని కోరాడు. ఇందుకు పుష్ప నిరాకరించింది.

దీంతో కోపోధ్రిక్తుడైన షేక్‌ సమ్మ.. పుష్పను దారుణంగా చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను, సోదరుడునీ కూడా షేక్ షమ్మ గాయపరిచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు షేక్ షమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >
Image 1

తిరుమల నిశ్శబ్దంలో భక్తి దీపం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-14 13:07:39

Readmore >
Image 1

షాబాద్‌ ఉన్నత పాఠశాలో సమస్త పూర్వ విద్యార్థుల

Posted On 2026-06-14 13:04:49

Readmore >
Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >