| Daily భారత్
Logo




పోలీస్ స్టేషన్లోనే అధికార పార్టీ నాయకుల మీడియా సమావేశం

News

Posted on 2025-07-22 10:52:48

Share: Share


పోలీస్ స్టేషన్లోనే అధికార పార్టీ నాయకుల మీడియా సమావేశం

విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలు

ఆలస్యంగా వెలుగు చూసిన వైనం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్మూర్ డివిజన్ లోని పోలీస్ ఠణ లో ని టేబుల్ పై కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్,

 ఆర్మూర్ పోలీసుల నిర్వాకం,నవ్వితే నవ్విపోదురు గాక మాకేంటి అన్నట్లు గా...అధికారం మనదైతే అడిగేవాడు ఎవరూ లేరు ...

అన్న చందనంగా కాంగ్రెస్ పార్టీ

శ్రేణులు వ్యవహరిస్తున్నాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆర్మూర్ డివిజన్లోని  పోలీస్ స్టేషన్లో జరిగిన  సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఇటీవల నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మధ్య జరిగిన పరస్పర దాడుల విషయనికి సంబంధించి కాంగ్రెస్ చోట మోటా నాయకులు ఏకంగా పోలీస్ ఠణ లో పోలీసు అధికారి కూర్చుండే టెబుల్ పై కూర్చొని లోపల సమావేశం నిర్వహించారు. పోలీస్ కార్యాలయం కాస్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారింది. 

 నిజామాబాద్ జిల్లాలోని  ఆర్మూర్ డివిజన్ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారి కూర్చుండే టేబుల్ పై నే కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించాడంతో ప్రజల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

ఈ పోలీస్ ఠణ తోపాటు జిల్లా పోలీసులకు తలవంపులను తెచ్చింది. అయితే జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇలాంటి విషయాల్లో ఎవరికీ తలోగవద్దని నిత్యం తరచుగా ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో పర్యటిస్తూ పోలీసుల తీరుపై న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు కోసం వచ్చిన ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అని తనిఖీలు చేపడుతున్న వేల్పూర్ పోలీసులు ఏ మాత్రం పోలీస్ కమిషనర్ ఆదేశాలు లెక్కచేయకుండా తమ పని తాము కానిచేశారు. కానీ చేశారు  ఈ విషయమై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

బాల్కొండ నియోజక వర్గం కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన నాయకులు ఆర్మూర్ డివిజన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల  సమావేశం నిర్వహించడం ఏంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రెస్ మీట్ నిర్వహణకు ఆర్మూర్ పోలీసులే దగ్గరుండి ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో ఇటీవల బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏర్పడిన వివాదంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి ఆర్మూర్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ముందస్తు బైండోవర్ చేసిన కాంగ్రెస్ నాయకులకు రాచ మర్యాదలు చేసిన పోలీసులు ప్రెస్ మీట్ ను కూడా తమ పోలీస్ స్టేషన్లోనే ఏర్పాటు చేయడం  ఆర్మూర్ పోలీసులు ఏ మేరకు రాజకీయ ఒత్తిడితో పని చేస్తున్నారనే దానికి అద్దం పడుతోంది.

ప్రెస్ మీట్ నిర్వహించిన టేబుల్ పై పోలీసుల టోపీలు ఫైళ్లు కూడా ఉన్నాయి. 

అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాచమర్యాదలు చేసిన పోలీసులపై శాఖాపర్యమైన చర్యలు తీసుకోవాలని ఆయా నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >