| Daily భారత్
Logo




తిరుమల శ్రీవారిని దర్శించుకున్న - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

News

Posted on 2025-07-22 12:55:46

Share: Share


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ప్రజలందరూ సుఖశాంతులతో పాడిపంటలతో సంతోషంగా ఉండాలని స్వామిని వేడుకున్న అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కలియుగ ప్రత్యక్ష దైవం అయినా తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ప్రత్యేక ద్వారం నుండి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కి ఘనస్వాగతం పలికిన వేద పండితులు శాలువాతో సత్కరించి  ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తిరుమల పుణ్య క్షేత్రం మరింత అభివృద్ధి సాధించనుందని అన్నారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేసిన లేఖలకు ప్రత్యేక దర్శనం, వసతి గృహం కల్పిస్తున్న టీటీడీ బోర్డుకు కృతజ్ఞతలు  తెలిపారు.

ఏడుకొండల వెంకన్న స్వామి వారి ఆశీర్వాదంతో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రధాని మోదీకి మరింత మనోభాలన్నీ ప్రసాదించాలని, ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేల మంచి బుద్దిని ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచాల జ్ఞానేందర్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ధన్ పాల్ శ్రీనివాస్, కొంజేర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >