Posted on 2025-08-15 12:34:37
ఒకే వేదికపై 75 మంది మానసిక దివ్యాంగుల నృత్యం..
స్నేహ సొసైటీకి ప్రశంస పత్రం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్వాతంత్ర్య దినోత్సవం వేళ నిజామాబాద్ లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది.. రాష్ట్రంలోనే తొలిసారిగా మానసిక దివ్యాంగులు స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 75 మంది మానసిక వికలాంగులు ఒకేసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా అద్భుతంగా నృత్యం చేసి ప్రతిభ కనబరిచారు.. నిజమాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఇందుకు వేదికగా నిలిచింది.. జై హో.. జై హో అంటూ సాగిన పాటపై మానసిక దివ్యాంగులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది.. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మానసిక దివ్యాంగుల ప్రదర్శన తిలకించారు.. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీసు కమిషనర్ సాయి చైతన్యలు సైతం ప్రదర్శనను చూసి మానసిక వికలాంగులను అభినందించారు.. రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి స్నేహా సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్ధయ్య అందుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరిలు కార్యక్రమంలో పాల్గొన్నారు.. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేతుల మీదుగా ప్రదర్శనకు గానూ సిద్ధయ్య జ్యోతిలు ప్రశంసా పత్రం , జ్ఞాపిక అందుకున్నారు.. వాస్తవానికి వారు అందరిలాంటి వారు కాదు... మానసిక వికలాంగులు... సమాజంలో చిన్న చూపునకు వివక్షకు గురవుతున్న వారు.. అయినా స్నేహా సొసైటీ ఆధ్వర్యంలో అనేక నైపుణ్యాలు పొందు తున్నారు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా స్నేహా సొసైటీ ద్వారా వారి నృత్య కళా నైపుణ్యం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది.. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ అవకాశం ఇప్పించి అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో మానసిక దివ్యాంగులు ప్రతిభను చూపించినందుకు స్నేహా సొసైటీ తరఫున సిద్ధయ్య జ్యోతిలు సంతోషం వ్యక్తం చేశారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >