| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

News

Posted on 2025-08-15 12:45:22

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు పంపిణీ

లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్యాంప్ ఆఫీస్, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని మైదానంలో ఏర్పాటు చేసిన 

స్వాతంత్ర్య వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసి, అభినందించారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ

జిల్లాలోని 495 మంది ముస్లిం మహిళలు, ఏడుగురు క్రిస్టియన్ మహిళలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు కలిసి పంపిణీ చేశారు.

Image 1

జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు

Posted On 2026-07-13 05:57:44

Readmore >
Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >