Posted on 2025-08-23 14:13:39
ఒకప్పుడు వ్యవసాయ రంగంలో రైతన్నలకు తోడుగా అండగా ఉండే ఎద్దుల జాతి
దీనికి కారణం ఎవరు.. యాంత్రికరణ నా.. లేదా పశువదనే కారణమా..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఒకప్పుడు రైతన్నలు తమ పంట పొలాలను పండించుకోవాలంటే ఎద్దుల సహాయంతో దుక్కి దున్ని నుండి మొదలు పెడితే వారు పండించిన వరి ధాన్యం, ఇతర పంటలను ఇంటికి తరలించే వరకు రైతన్నలకు తోడు నేస్తంగా ఎడ్ల జాతిపశువులు అన్నదాతల పట్ల కృతజ్ఞతను వ్యక్తంచేసే అమావాస్య పొలాల అమావాస్య పండగను గ్రామ గ్రామాన ఓ పండగ వాతావరణం లో రైతులు తమ ఊర్లో సాయంకాలం ఎడ్లను అందంగా అలంకరించి ఊరేగింపుగా నిర్వహించడం ఈ పండగ యొక్క అసలైన ఆనవాయితీ. కానీ యాంత్రికరణలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో అవి కాస్త కనుమరుగైపోతున్నాయి. పోతున్నాయి అనడం కంటే పోయాయి అని చెప్పాలి. ట్రాక్టర్లు, పొలాలు నాటే మిషన్లు రావడం తో రైతులు ఎద్దులను వాడడం తక్కువైపోయింది. కారణం తక్కువ సమయంలో వ్యవసాయ పనులు వేగంగా అవుతున్నాయి. ఒకప్పుడు గ్రామాలలో ఇంటికో ఎడ్ల అరక ఉండేది. వ్యవసాయ పనులన్నీ రైతులు వీటితోనే ఉపయోగించేవారు. కానీ నేటి తరానికి పొలాల అమావాస్య అంటే ఏంటో అసలు ఈ పండగ మన సాంప్రదాయమా లేదా అనేది తెలియని పరిస్థితి వారిది. ఎంత అభివృద్ధి చెందినా యాంత్రికరణ అభివృద్ధి చెందినప్పటికీ మన పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. దీనికి తోడు ఎంతో విలువైన ప్రత్యక్ష దైవంగా కొలిచే మన హైందవ ధర్మం గోమాతలు, ఎడ్లు పశు వదశాలలకు తరలిపోతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే వీటి గురించి చరిత్ర తప్ప మాట్లాడుకోవడానికి మిగిలింది ఏమీ లేదు. ఇక యాంత్రికరణ విషయానికి వస్తే ఒకప్పుడు రైతే రాజు అన్న విషయాన్ని, కాస్త మరుగున పడాల్సిన పరిస్థితి వస్తుంది. ట్రాక్టర్లు, నాటే మిషిన్ల కంటే రైతులు అప్పుడు ఎద్దుల సహాయంతోపంట ధాన్యం కంటే ఇప్పుడు ఎక్కువ వస్తుందా అనేది....? అందుకే మన పెద్దలు అన్నారు రైతే రాజు అని ఇప్పటికైనా ఆలోచించండి... ఎద్దుల ఉపయోగం ఏంటి అనేది.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >