| Daily భారత్
Logo




వీధి పులుల్ల తయారవుతున్న శునకాలు

News

Posted on 2025-08-23 14:15:01

Share: Share


వీధి పులుల్ల తయారవుతున్న శునకాలు

వీటిని అదుపులోకి తీసుకువచ్చేది ఎవరు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  జిల్లావ్యాప్తంగా రోజు రోజుకి వీధి కుక్కలు వీధి పులుళ్ల తయారవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడో చోట చిన్నారులను గాయపరుస్తూ వీధి కుక్కలు అంటేనే ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంటుంది. అసలు వీటి నియంత్రణ కోసం ప్రభుత్వం నుండి ఓ ప్రత్యేక విభాగం అంటూ ఉందా అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ  కుక్కలు గాయపరుస్తున్నాయంటే సరే.. రేపు అవే కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తే దీనికి బాధ్యులు ఎవరు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నందిపేట మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో శనివారం అభం శుభం తెలియని రెండేళ్ల చిన్నారి తన ఇంటి ముంగిట ఆడుకుంటుండగా పిచ్చికుక్క అకస్మాత్తుగా దాడి చేయడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్క దాడి చేస్తుండగా గమనించిన చిన్నారి అమ్మమ్మ కర్రతో ఎంత తరిమిన వదలకుండా చిన్నారిని కరవడంతో తలకు, చెంప, బుజము ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. నందిపేట మండల కేంద్రంలో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహిళలు చిన్నపిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయంతో వణుకుతున్నారు. ప్రధాన కూడళ్ళ వద్ద గుంపులు గుంపులుగా సుమారు 50 నుంచి60 కుక్కలు స్వైర విహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వెంటనే అధికారులు తగు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కంటేశ్వర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ తమ పిల్లలను బయట పంపాలంటేనే భయంగా ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనికి సంబంధించిన అధికారులు కుక్కల నియంత్రణను పూర్తిగా అరికట్టాలని లేకపోతే తమ చిన్నారుల ప్రాణాలు కుక్కలు బలి తీసుకుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >