| Daily భారత్
Logo




హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులు అరెస్టు

News

Posted on 2025-08-23 16:16:28

Share: Share


హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులు అరెస్టు

డైలీ భారత్, చివ్వెంల: 2025 ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం సుమారు 01:00 గంటల సమయంలో, చివ్వెంల మండలం కుడకుడ గ్రామ శివారులోని మధురా వైన్స్ వద్ద, అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మయ్య, వయసు 40 సంవత్సరాలు, వృత్తి: కూలీ పై నలుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన సంఘటన జరిగింది.

నిందితుల వివరాలు:

1.  దండుగుల శేఖర్, తండ్రి: సీతారాములు, వయసు: 28 సం., వృత్తి: కూలీ, R/o కుడకుడ గ్రామం.

2.  పల్లపు గోపి, తండ్రి: వెంకులు, వయసు: 25 సం., వృత్తి: కూలీ, R/o సుందరయ్యనగర్, సూర్యాపేట.

3.  పల్లపు రాము, తండ్రి: లింగయ్య, వయసు: 20 సం., వృత్తి: కూలీ, R/o టేకుమట్ల గ్రామం.

4.  పసుపుల చంటి, తండ్రి: మల్లయ్య, వయసు: 20 సం., వృత్తి: కూలీ, R/o రాయినిగూడెం గ్రామం.

నేరానికి కారణం:

నిందితుడు దండుగుల శేఖర్ (A1) దండుగుల లక్ష్మయ్య భార్య వెంకటమ్మతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన పూర్వం గొడవలు జరగడం. నిందితుడు పల్లపు గోపి (A2) కు రాయి పనుల వివాదంలో దండుగుల లక్ష్మయ్యతో గొడవలు జరగడం.ఈ ద్వేష భావనలతో నిందితులు నలుగురూ కలిసి దండుగుల లక్ష్మయ్యను హత్య చేయాలని పథకం వేసినారు.

2025 ఆగస్టు 22న నిందితులు పథకం ప్రకారం దండుగుల లక్ష్మయ్యను చివ్వెంలకు పిలిచి, కర్రలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. బాధితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడంతో నిందితులు కారులో వెంబడించారు. మధురా వైన్స్ వద్ద అతనిపై దాడి చేయాలని యత్నించినా, అక్కడ ప్రజలు ఎక్కువగా ఉండడంతో విఫలమై కర్రలను అక్కడే వదిలేసి AP 07 BQ 1789 నెంబర్ గల స్విఫ్ట్ కారులో పారిపోయారు.

అరెస్టులు – స్వాధీనం:

2025 ఆగస్టు 23 ఉదయం, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. రాజశేఖర్ ఆద్వర్యంలో  చివ్వెంల పోలీసులు సుందరయ్య నగర్, సూర్యాపేట టౌన్లో  నలుగురు నిందితులను పట్టుకున్నారు.

పంచుల సమక్షంలో స్వాధీనం:

నేరంలో వాడిన మారుతి సుజుకీ స్విఫ్ట్ కారు (AP 07 BQ 1789).  నిందితుల మొబైల్ ఫోన్లు

నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో రిమాండ్ కు  పంపించారు అని DSP V. ప్రసన్న కుమార్ తెలిపినారు.ఇట్టి కార్యక్రమం లో  ci రాజశేఖర్ ,si v మహేశ్వర్ మరియు CHIVVEMLA సిబ్బంది పాల్గొన్నారు

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >