| Daily భారత్
Logo




ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

News

Posted on 2025-08-23 16:27:59

Share: Share


ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

డైలీ భారత్, ప్రకాశం జిల్లా:మార్కాపురం పట్టణానికి చెందిన తనీర్ సురేంద్ర (వయస్సు: 33 సంవత్సరాలు) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా తేది: 23-08-2025 ఉదయం సుమారు 10:00 గంటలకు తాను చనిపోతున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన అక్క వెంటనే మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం తెలియపరిచినది. మార్కాపురం డీఎస్పీ మరియు సీఐ ఆదేశాల మేరకు, ఎస్సై అంకమ్మరావు మరియు సిబ్బంది, ఐటీ కోర్ టీం సాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సురేంద్ర ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని అతని ప్రాణాలను కాపాడడం జరిగింది. ఆ తర్వాత అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, మానసికంగా ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను చాకచక్యంతో కాపాడిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ SI  అంకమ్మరావు మరియు వారి సిబ్బంది కానిస్టేబుల్స్ PC 3593 కాశీ రావు, PC 3953 రంగనాయకులు మరియు ఐటి కోర్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్, ఐపీఎస్. అభినందించారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >