| Daily భారత్
Logo




యూరియా పై గలమెత్తిన బిఆర్ఎస్ పార్టీ

News

Posted on 2025-08-25 10:03:36

Share: Share


యూరియా పై గలమెత్తిన బిఆర్ఎస్ పార్టీ

కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య 

. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై బి ఆర్ఎస్ పార్టీ  గళం మెత్తింది. అనేక రోజులుగా రైతులు ఇబ్బందులకు గురిచేస్తున్న సహాయ సహకార సంస్థ. యూరియా కొరత ఎందుకు ఏర్పడిందని రైతులను  ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులపై చిన్నచూపు చూస్తున్నారని రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాయమాటలు చెప్పి కొందరికి  రుణమాఫీ చేసిన ఘనుడు.రుణమాపీ దేవుడు ఎరుగు యూరియాకి లైన్లో నిలబడు అనే నినాదంతో రైతులను మోసం చేశారని రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్న ఈ పాలక వర్గం. ఎక్కడ చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల గోస కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. పంట పండాలన్న మొక్క  ఎదగడానికి ఎరువులు అవసరమని వారు ఎరువుల కోసం లైన్లో క్యూలు కడుతుంటే వారిపై జాలీ దయ చూపని రేవంత్ రెడ్డి. సహకార సంస్థలు యూరియా తీసుకోవాలంటే రైతు తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరమని వారు పెట్టిన నిబంధనకు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఒక్క రైతుకు ఒక్క యూరియా కట్ట మాత్రమే అనే నినాదంతో ఈ ప్రభుత్వం పని చేస్తుందని సకాలంలో రైతు పంటకు ఎరువు అందించకపోతే మొక్క ఎదుగుదల లేక రైతుకు లక్షల రూపాయలు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని  రైతులకు సరైన సమయంలో ఎరువులు సరఫరా చేయక పోతే రాబోవు రోజుల్లో రైతు పక్షాన బిఆర్ఎస్ పార్టీ నిలబడి కలబడి పోరాడుతుందని వారు అన్నారు.రైతు లు  క్యూలైన్లో నిల్చొని యూరియా కోసం ఎదురుచూసే రోజులు వస్తాయని ఎప్పుడు కలలో కూడా అనుకోలేదని టిఆర్ఎస్ పార్టీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య అన్నారు. గత బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతులు కోసం 10 సంవత్సరాల  పరిపాలనలో ఏ ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కి ఎరువుల కోసం ఇబ్బందులు పడలేదని. రైతే రాజు అంటూ రైతులను పూర్తిగా మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం తప్పదని బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండలంలో పెద్ద ఎత్తున గలమెత్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ కు రైతులు వినతి పత్రం సమర్పించి వారి గోడును విన్నవించారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల రైతులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల వీరయ్య ఆత్మ కమిటీ చైర్మన్, లావుడియా సత్యనారాయణ టఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి, పెద్ద మల్ల నరేంద్ర ప్రసాద్  రైతు సమన్వయ జిల్లా నాయకులు, మహిళా నాయకురాలు కనుకుంట్ల రాములమ్మ, కత్తి బాలకృష్ణ, మాలోత్ కుమార్, భానోత్ బాలాజీ, ముస్లిం మైనారిటీ యువజన నాయకులు ఇర్ఫాన్, రాఘవపురం బి ఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటనారాయణ, తుంపూరి రాములు, సునీత, చిట్టూరి సుధీర్ బాబు, ఉప్పనపల్లి ప్రసాద్, మాచిన శ్రీకాంత్, గాజుల కృష్ణ, కార్తీక్ టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >