| Daily భారత్
Logo




ఉదృతంగా ప్రవహిస్తున్న బాసర గోదావరి నది

News

Posted on 2025-08-30 09:43:10

Share: Share


ఉదృతంగా ప్రవహిస్తున్న బాసర గోదావరి నది

జలదిగ్బంధంలో బాసర

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరికి వరద పోటెత్తడంతో బాసర జలదిగ్బంధం లో చిక్కింది. మూడు వైపులనుంచి వరద నీరు చుట్టేయడం తో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డిఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి గత రాత్రి నుంచి సహాయక చర్యలను ముమ్మరం చేసాయి. ఆయా కాటేజీలో ఉన్న భక్తులను షెల్టర్ లకు తరలిస్తున్నారు. మరో వైవు బాసర వంతెన దాక గోదావరి ప్రవాహం వుండడంతో రైల్వే అధికారులు నాందేడ్ వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసారు. ఎగువ గోదావరి నుంచి భారీగా వరద రావడంతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్లే బాసర వద్ద నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. ఈపాటికే కందుకుర్తి వద్ద వంతెన మీదుగా గోదావరి ప్రవాహం అవుతుండడంతో మహారాష్ట్ర వైపు రాకపోకలను నిలిపి వేశారు. ప్రస్తుతం వర్షాలు లేక పోయినప్పటికి గోదావరికి వరద పోటు అంతకంతకు పెరగడంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కూడా తోడైంది అందుకే బాసర జ్ఞాన సరస్వతి అమ్మ వారి మందిరం కు వెళ్లే మూడువైపులా వరద నీరు చుట్టేసింది. ఆలయ వేద పండితులు గోదావరి శాంతించేలా ప్రత్యేక పూజలు సైతం  నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం ఒక రోజు ముందే బాసర క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ సమీపంలోని ఆయా సత్రాలు గెస్ట్ హౌస్ లు కాటేజీ ల్లో ఉన్నారు. అన్ని వైపుల వరద నీరు చుట్టేయడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఎన్డిఎఫ్ బలగాలు రంగంలోకి దిగి ఆయా హోటళ్లు గెస్ట్ హౌస్ ల్లో ఉన్న వారిని బోట్ల మీద సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >