Posted on 2025-08-30 13:57:27
గణేష్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పాత పాల్వంచ స్నేహ యూత్ ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదానం
ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: గణపతి నవరాత్రులు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ తూర్పు బజార్ లో స్నేహ యూత్ ఆధ్వర్యంలో*ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సుమారు వెయ్యి మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారుఈ కార్యక్రమంలో *రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వినాయక విగ్రహం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం కొత్వాల అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మంది మహిళలు, భక్తులు అన్న సంతర్పణలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాత పాల్వంచ మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, స్నేహ యూత్ సభ్యులు, నిర్వాహకులు పసుపులేటి సంతోష్, యాటా రాఘవ, అక్కల వినీత్, మద్దోజు రవితేజ, సాయిరి దుర్గా ప్రసాద్, బోడ్డు బాను ప్రసాద్, పెనుగొండ వినోద్, యాట నర్సింహా, యాట లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >