Posted on 2025-08-30 14:47:51
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని పోలీసు కమిషనర్ సాయిచైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ లో శనివారం వీఆర్ లో ఉన్న సర్కిల్ ఇన్స్ పెక్టర్ డి.ఎల్లయ్య గౌడ్, సి.సి.ఆర్.బిలో ఉన్న ఎస్సై తాళ్ళ నర్సింలు, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఎల్.యాకుబ్ రెడ్డి శనివారం పదవి విరమణ " పొందారు. వీరికి పోలీసు కమిషనర్ శాలువలతో సత్కరించి" పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) " ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంట్ కు చేసిన సేవలు ఎంతో ఘననీయమన్నారు. పదవి విరమణ అనంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని మీరు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు భాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్లు కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి,రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, ఆఫీస్ సూపరింటెండెంట్ లు శంకర్, బషీర్ అహ్మద్, షకీల్ పాషా, పదవి విరమణ వారి కుటుంబ సభ్యులు హజరయ్యారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >