| Daily భారత్
Logo




గణేష్ నిమజ్జనం నిమిత్తం ఉమ్మెడ బ్రిడ్జిని పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్

News

Posted on 2025-08-30 17:45:32

Share: Share


గణేష్ నిమజ్జనం నిమిత్తం ఉమ్మెడ బ్రిడ్జిని పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్

గణేష్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత పోలీస్ సిబ్బందికి ప్రజలు సహకరించలి..

పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నందిపేట్ లోని ఉమ్మెడ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ నిమజ్జన స్థలాన్ని నిజాంబాద్ సిపి సాయి చైతన్య శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జన కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నందిపేట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌కు పలు సూచనలు తెలియజేయడం జరిగింది , నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆలాగే డీజే లను అనుమతించకూడదని తెలిపారు. ప్రజలు పోలీసు విభాగానికి సహకరించి, గణేశ్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సీ పి వెంట నందిపేట ఎస్సై శ్యామ్ రాజ్ ఉన్నారు.

Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >