Posted on 2025-08-31 14:12:54
ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను తక్షణమే ఆదుకోవాలి
సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ డిమాండ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అతివృష్టితో కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రతిపాదికన ప్రభుత్వం ఆదుకోవాలని,ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను తక్షణమేఆదుకోవాలని, నిత్యావసర సామాగ్రి, ఆహార పదార్థాలను వెంటనే అందించాలని సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ముంపుకు గురైనా గ్రామాలు, పంట పొలాలను పరిశీంచారు. భాదితులను సిపి(ఎంఎల్) మాస్ లైన్ స్థానిక నేతలతో బృందంగా పరామర్శించారు. శనివారం నాడు సిరికొండ మండలం లోని గడ్కోల్, ధర్పల్లి మండలంలోని వాడి గ్రామాల్లో సందర్శించారు.
ఈ సందర్బంగా సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ మాట్లాడుతూ భారీవరదల వల్ల సిరికొండ మండలంలోని కప్పలవాగు పరివాహక గ్రామాలు, పంట పొలాలు నీట మునిగి ప్రజలను ఆర్థికంగా ఇండ్లు, ఎలక్ట్రికల్ వస్తులను కూడా కోల్పోయేలా చేసి కట్టు బట్టలతో నిలిచి ఉన్నారని అన్నారు. మరదలు వానాల వల్ల తక్షణమే ప్రభుత్వం మానవత దుఃఖంతో ఆలోచించి అన్ని గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువుల తో పాటు ఆర్థిక సాయం అందించాలన్నారు. వానలు వరదల వల్ల ప్రజలు ఇల్లు కూలిపోయి, పొలాలకు సంబంధించిన యూరియా బ్యాగులు నిలువ ఉంచుకున్నవి కోల్పోయి, కట్టుబట్టలతో మాత్రమే బయటపడ్డరన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందేనన్నారు. ఇండ్లు కోల్పోయినవారికి 1లక్ష, పంటకోల్పోయిన రైతంగానికి ఎకరానా 50వేలు ఇండ్లు నీటమునిగిన వారికి 50వేలు, యూరియా బస్తాలు, బియ్యం సంచులు కోల్పోయిన వారికీ 50వేలు, తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించి అందజేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. పరిశీలిన బృందంలో సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, జిల్లా నాయకులు బి. దేవారం, ఎస్. సురేష్, ఆర్. రమేష్, డివిజన్ నాయకులు జి. సాయిరెడ్డి, మండల నాయకులు ఎం. లింబాద్రి, బి. కిశోర్, ఇ. రమేష్, కే. రాంజీ, ఎస్. కిశోర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >