Posted on 2025-08-31 14:11:28
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్ పైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతు...కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కుల గణన లెక్కలు ఒక తప్పుల తడక అన్నారు ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం హిందూ బీసీలు 46.25 % అని ముస్లిం బీసీలు 10.8% అని తేల్చి ముస్లింలను బీసీ వర్గంలో చేర్చి బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. బీసీ బిడ్డల రిజర్వేషన్లను ముస్లింలకు పంచి పెట్టె రేవంత్ సర్కార్ కు ముస్లింల వక్ఫ్ భూములను బీసీ బిడ్డలకు పంచె దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఇది బీసీ డిక్లరేషన్ బిల్ కాదు ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్ అన్నారు, మతపరమైన ఈ రిజర్వేషన్లను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని స్పష్టం చేసారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్‌ను ఎప్పటికీ అంగీకరించలెమని 42 శాతం మొత్తం రిజర్వేషన్ బీసీలకే రావాలని డిమాండ్ చేసారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఏ తుంగలో తొక్కరో సమాధానం చెప్పాలన్నారు. సంవత్సరానికి 20 వేల కోట్ల చొప్పున లక్ష కోట్ల సంక్షేమ నిధి ఎక్కడ..? పోయిన సంవత్సరం బడ్జెట్ లో కేవలం 9200 కోట్లు మాత్రమే పెట్టి బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పలన్నారు. బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి..? వెంటనే బీసీలకు వడ్డీ లేని 10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఫీ రియంబర్స్ మెంట్ విడుదల చేయక బీసీ బిడ్డలు చదువుకు దూరం అవుతున్నారని వెంటనే ప్రభుత్వం ఫీ రియంబర్స్ మెంట్స్ విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటే ముందు ముస్లింలను 10% బీసీ రిజర్వేషన్ నుండి తొలగించాలన్నారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని లేదంటే ఏ స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ఈ డ్రామాలు ఆడుతున్నారో అదే స్థానిక ఎన్నికల్లో బీసీ బిడ్డలు కాంగ్రెస్ ను బొంద పెట్టడం ఖాయం అని హెచ్చరించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >