Posted on 2025-09-01 15:27:17
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్సై ఏడుకొండలు.
- ఇలాటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
- ఆర్ఎంపీ లు ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు.
- లింగ నిర్ధారణ, అక్రమ అబార్షన్ నేరం.
- నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, వారికి ప్రోత్సాహం ఇవ్వాలి.
ప్రసన్న కుమార్, DSP సూర్యాపేట సబ్ డివిజన్
డైలీ భారత్, సూర్యాపేట: మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భవతి బయ్య అనూష మృతి చెందిన కేసులో నమ్మదగిన సమాచారంపై ఈరోజు ముగ్గురు నిందితులను సూర్యాపేట పట్టణం రితిక హోటల్ వద్ద అరెస్టు చేయడం జరిగినది. అబార్షన్ చేయడానికి సూర్యాపేట పట్టణం ఒమేగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఆస్పటల్ నిర్వాహకులు A1 గోరంట్ల సంజీవ, A6 వీరబాయిన వేణు, స్కానింగ్ చేయడానికి అబార్షన్ చేయడానికి ఏర్పాటు చేసిన A2 జాల జానయ్య లను అరెస్ట్ చేయడం జరిగినది.
ఈరోజు అరెస్ట్ చేసిన నిందితులు.
A1 - గోరంట్ల సంజీవ, సూర్యాపేట పట్టణ, ఒమేగా హాస్పిటల్ మేనేజ్మెంట్.
A2 - జాల జానయ్య టేకుమట్ల గ్రామము, సూర్యాపేట మండలం, ఆర్ఎంపీ డాక్టర్.
A6 - వీరబోయిన వేణు, సూర్యాపేట పట్టణం, ఒమేగా హాస్పిటల్ మేనేజ్మెంట్.
కేసు వివరాలు. :
మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భయ్యా నగేష్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు భార్య బయ్య అనూష మూడోసారి గర్భం దాల్చి ఐదో నెల గర్భవతి ఉండగా గర్భంలో ఉన్నది ఆడ, మగ శిశువు అని తెలుసుకోవాలని ఉద్దేశంతో తన దగ్గరి బంధువైన అదే గ్రామానికి చెందిన A8 ఉప్పల సందీప్ ద్వారా టేకుమట్ల గ్రామంలో ఆర్ఎంపీ గా పని A2 జాల జానయ్య ను సంప్రదించి నకిరేకల్ కు చెందిన ఆర్ఎంపీ A3 బాత్క యాదగిరి వద్ది 17/05/2025 రోజున అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా అక్రమ స్కానింగ్ నిర్వహించి గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తెలుసుకుంటారు. దీనికి గాను జానయ్య మృతురాలి భర్త A9 బయ్య నగేష్ నుండి రూ.12 వేల రూపాయలు తీసుకున్నాడు.
గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తెలిసిన అనంతరం అబార్షన్ చేయించాలనే ఉద్దేశ్యంతో A2 జానయ్య ద్వారా తేది: 17/05/2025 రోజున సూర్యాపేట పట్టణంలో గల ఒమేగా హాస్పటల్ (సంజీవిని హాస్పటల్ ) కు వచ్చి A1 గోరంట్ల సంజీవ, A6 వీరబోయిన వేణును సంప్రదించి కూసుమంచి కి చెందిన RMP నాగరాజు, అర్వపల్లి కి చెందిన RMP చెవుగొని గణేష్ లతో అబార్షన్ చేయిస్తారు. అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించడంతో ఖమ్మంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ పరీక్ష చేసిన వైద్యులు 5నెల గర్భవతి అయిన భయ అనూష మృతి చెందినది అని నిర్ధారించారు, మృత్చెందిన అనూషను అదే రోజున రాఘవపురం గ్రామంలో అంత్యక్రియలు చేశారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి కార్యాలయం వారు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా నేరం సంఖ్య 197/2025 ప్రకారం సెక్షన్ 105, 90 భారతీయ న్యాయ సంహిత BNS, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 23, ప్రి కన్సెప్షన్ ప్రి నటల్ డయాగ్నటిక్ టెక్నిక్స్ ఆక్ట్ 1994 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పదిమంది నిందితులుగా చేర్చడం జరిగినది.
నిందితులు :
A1 - గోరంట్ల సంజీవ, సూర్యాపేట పట్టణ, ఒమేగా హాస్పిటల్ మేనేజ్మెంట్.
A2 - జాల జానయ్య టేకుమట్ల గ్రామము, సూర్యాపేట మండలం, ఆర్ఎంపీ డాక్టర్.
A3 - బాత్క యాదగిరి, నకిరేకల్ పట్టణం, ఆర్ఎంపీ డాక్టర్. (అరెస్ట్ 08/08/2025)
A4 - నాగరాజు, కూసుమంచి, ఖమ్మం జిల్లా, ఆర్ఎంపీ డాక్టర్.
A5 - చౌగాని గణేష్, అర్వపల్లి గ్రామం, ఆర్ఎంపీ డాక్టర్. (అరెస్ట్, మే 29వ తేది)
A6 - వీరబోయిన వేణు, సూర్యాపేట పట్టణం, ఒమేగా హాస్పిటల్ మేనేజ్మెంట్.
A7 - పిడమర్తి శోభ సూర్యపేట టౌన్, హాస్పిటల్ నర్స్.
A8 - ఉప్పల సందీప్, సర్వారం గ్రామం, మోతే మండలం. (అరెస్ట్, మే 29వ తేది)
A9 - భయ్యా నగేష్, మృతురాలి భర్త, రాఘవపురం, మోతే మండలం.
A10 - తొట్ల గణేష్, వర్ధమానుకోట గ్రామం, నాగారం మండలం, నివాసము విద్యానగర్ సూర్యాపేట.
కేసు దర్యాప్తు చేసి ఇందులో నిందితుడైన A8 ఉప్పల సందీప్ హాస్పటల్లో పనిచేసిన అనుభవం నుండి టేకుమట్ల గ్రామానికి చెందిన జానయ్యను సంప్రదించదానికి మృతురాలి భర్తకు సహాయం చేశాడు, సందీప్ ను మే నెల 29వ తారీఖున అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగింది, అబార్షన్ చేసిన A5 చౌవుగోని గణేష్ ను మే నెల 29వ తారీకు అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది. నకిరేకల్ నందు మృతురాలికి స్కానింగ్ చేసి ఆడ శిశు అని నిర్ధారించిన ఆర్ఎంపీ డాక్టర్ బత్క యాదగిరిని ఆగస్టు ఎనిమిదో తారీఖున అరెస్టు చేసి రిమాండ్ పంపడం జరిగింది.
కేసు తదుపరి విచారణ జరిపి నమ్మదగిన సమాచారంపై ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో హోటల్ రిదిక వద్ద ఉన్నారనే సమాచారం పై పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు అరెస్టు నిందితులైన A1 గోరంట్ల సంజీవ, A2 జాల జానయ్య, A6 వీరాబోయిన వేణు లను నమ్మదగిన సమాచారం పై ఈరోజు ఉదయం అరెస్టు చేయడం జరిగినది. A 2 నిందితుడైన జాల జానయ్య అబార్షన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ A1 సంజీవ, A6 వీరబోయిన వేణు అబార్షన్ చేయడానికి హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >