Posted on 2025-09-01 17:26:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని అని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి అన్నారు వియంబంజర నుండి చంద్రుగొండ మీదుగా కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు కల్లూరు,తల్లాడ,ఏన్కూరు మరియు జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలి.అదే విధంగా కొత్తగూడెం నుండి వీయం బంజర వైపు ప్రయాణించే వాహనదారులు జూలూరుపాడు,ఏన్కూరు,తల్లాడ మరియు కల్లూరు మీదుగా వియం బంజర వైపు ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్ డైవర్షన్ మూడవ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వాహనదారుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు,ఆటంకాలు తలెత్తకుండా,ట్రాఫిక్లో చిక్కుకోకుండా పోలీసు వారు చేపట్టే ట్రాఫిక్ డైవర్షన్ ను గమనించి ప్రజలు సహకరించాలని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ఈ సందర్బంగా తెలియజేసినారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >