| Daily భారత్
Logo




భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా

News

Posted on 2025-09-03 14:53:04

Share: Share


భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా

డైలీ భారత్, ముస్తాబాద్: భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10,000/- రూల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ ఈరోజు తీర్పు వెల్లడించినట్లు ముస్తాబాద్ ఎస్‌.ఐ గణేష్ తెలిపారు.

ఈసందర్భంగా ఎస్‌.ఐ మాట్లాడుతూ…

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సదిమెల రామచంద్రం తన భార్య కనకవ్వను తరచూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని తెలిపారు. మద్యం సేవించి గొడవలు పెట్టడంతో పాటు 2016 డిసెంబర్ 2న ఉదయం 6 గంటల సమయంలో భార్యను దారుణంగా కొట్టాడని, టార్చ్‌లైట్‌తో దాడి చేసి గాయాలు చేశాడని తెలిపారు.వేధింపులు భరించలేక బాధితురాలు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడు సదిమెల రామచంద్రం పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అనంతరం అప్పటి ఎస్‌.ఐలు చిట్టిబాబు, ప్రవీణ్ చార్జ్‌షీట్ దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించగా, ఎస్‌.ఐ గణేష్, సీఎంస్ ఎస్‌.ఐ శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ తో పాటు 12 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.నిందితుడు రామచంద్రంపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ప్రవీణ్ మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్‌.ఐ గణేష్ తెలిపారు.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >