Posted on 2025-09-03 15:50:49
ఈ రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు అంటున్న పండితులు..
చంద్రగ్రహణం కారణంగా నిమజ్జనం తొమ్మిదవ రోజు చేయాలా.. 11వ రోజు చేయాలా అని సందిగ్ధంలో గణేష్ మండలి నిర్వాహకులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 7 తేదీన చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో గ్రహణం వస్తున్నందున గణేష్ నిమజ్జనం గురువారం నాలుగో తేదీ చేయాలా.. లేదా ఆరవ తేదీన 11వ రోజు శనివారం చేయాలా అని సందిగ్ధంలో జిల్లాలోని పలు గణేష్ మండలి నిర్వాహకులు సందిగ్ధంలో పడ్డారు. ఇది ఇలా ఉండగా మరోవైపు పోలీస్ శాఖ వారు ఈనెల 4న గురువారం నిమజ్జనం ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఓ ప్రకటన విడుదల చేశారు. నాలుగో తేదీన నిమజ్జనం పలు గణేష్ ప్రతిమలు నిమజ్జనానికి వెళ్తున్న నేపథ్యంలో నాలుగో తేదీ ఉదయం 6 గంటల నుండి 5వ తేదీ ఉదయం ఐదు గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కళ్ళు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఆరవ తేదీన 11 రోజులు వస్తున్నందున ఆరోజు కూడా సిపి ఆదేశాలు అమలు అవుతాయా లేదా అనేది చర్చనియాంశంగా మారింది. అయితే గ్రహణం ఉన్న సందర్భంగా ఎప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తే మంచిదో నని వినాయక భక్తులు అయోమయంలో పడుతున్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >