| Daily భారత్
Logo




అటవీశాఖ ఉద్యోగిని పై దాడి చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు

News

Posted on 2025-09-04 16:47:32

Share: Share


అటవీశాఖ ఉద్యోగిని పై దాడి చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు రేంజ్ పరిధిలోని, పాపకొల్లు బీట్- బీ పరిధిలోగల  రాసగానిగుట్ట కంపార్ట్మెంట్ నెంబర్ 31  ప్రాంతంలో,తేదీ 29.08. 2025న  ఉదయం 11.00 గంటల సమయంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయిన కొలిచలం విజయలక్ష్మి మరియు ప్లాంటేషన్ వాచర్ అయిన తేజావత్ రాము కలిసి విధులు నిర్వహిస్తుండగా, అట్టి ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మారుజాతి మొక్కలను నరికి వేసి ఉండడాన్ని గమనించినారు, అయితే అట్టి ప్రదేశము ఫారెస్ట్ కవర్ రేంజ్ పాయింట్ కనుక అట్టి ప్రదేశంలో మొక్కలు నాటవలసి యున్నది కనుక,పై అధికారుల ఆదేశానుసారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు వాచర్ లు ఇద్దరు కలిసి మొక్కలు నాటుచుండగా, మొక్కలు నాటుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎలకలోడ్డు గ్రామానికి చెందిన మడి సీతారాములు,మడి ప్రవీణ్,మడి ముత్తమ్మ లు అచ్చటకు వచ్చి మొక్కలు నాటడానికి వీల్లేదు, ఇచట గుత్తి కోయలు ఇలానే చెట్లను నరికి సాగు చేసుకుంటారు, మీరు అడ్డు చెబితే మీ సంగతి చూస్తాం, మిమ్ములను చంపుతామంటూ బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి, మొక్కలు నాటకుండా అడ్డగించి, విధులకు ఆటంకం కలిగించినారని, పక్కనే ఉన్న గుత్తి కోయ మహిళ అయిన మడివి హీడిమా ను రెచ్చగొట్టి, తనపై దాడికి ఉసిగొల్పినాడని, సదరు మహిళ రాయితో తన ను రెండు దెబ్బలు గట్టిగా కొట్టి ,జుట్టు పట్టుకొని లాగి కింద పడేసిందని, తమ వాచర్ వీడియో చిత్రీకరిస్తుంటే, వారంతా వాగు దాటి పారిపోయారని, కాసేపటికి బచ్చల నరసమ్మ అనే మహిళ కూడా తమ వద్దకు వచ్చి, దురుసుగా ప్రవర్తించి ,అసభ్య పదజాలంతో దూషించి, చంపుతా అంటూ బెదిరించినదని, అటవీ శాఖ వారి అనుమతి లేకుండా ,అటవీ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, 15 వేల రూపాయల విలువ చేసే చెట్లను నరికి, పత్తి పంట సాగు చేసుకుంటూ, ఎందుకు ఇలా అనుమతి లేకుండా పంటలు వేశారని ప్రశ్నించినందుకు, తమను బూతులు తిట్టి రాళ్లతో కొట్టి గాయపరిచి, మొక్కలు వేయనీయకుండా తమ విధులకు ఆటంకం కలిగించి, మరో మారు తమను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసిన, మడి సీతారాములు, ప్రవీణ్, ముత్తమ్మ , హీడిమా, నరసమ్మలపై చట్టరీత్య చర్య కొరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొలిచలం విజయలక్ష్మి, భర్త పేరు మాధరావు, వయసు 30 సంవత్సరములు, అను ఆమె ఫిర్యాదు ఇవ్వగా, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాదావత్ రవి కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసినారు.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >