Posted on 2025-09-04 16:52:37
జిల్లా పరిషత్ హై స్కూల్, అంబేద్కర్ నగర్, సిరిసిల్లలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం
డైలీ భారత్, సిరిసిల్ల:సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాలలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి, కవితలు, ప్రసంగాలు, పాటలతో ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల సేవలు, సమాజ నిర్మాణంలో వారి పాత్ర గురించి ప్రసంగించారు.
ప్రధానోపాధ్యాయులు నాగుల రమాదేవి తన ప్రసంగంలో ఉపాధ్యాయుల విలువ, వారి త్యాగం, దేశ భవిష్యత్ నిర్మాణంలో వారి పాత్రను వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని సమర్పణతో నిర్వర్తిస్తారని అన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొలాస మల్లేశం, బి. మంజుల, A. సత్యనారాయణ సామల రమాదేవి గూడూరు రవికుమార్ పర్కాల రవీందర్, బాలే గంగాభవాని సిరిపురం జ్యోతి, పల్లెవేని ఐలయ్య, జంగిటి భానుచందర్, Ch. రమాదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >