| Daily భారత్
Logo




వరద నష్టపరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన నివేదిక జిల్లా అధికారులు సిద్ధం చేయాలి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

News

Posted on 2025-09-04 16:54:01

Share: Share


వరద నష్టపరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన నివేదిక జిల్లా అధికారులు సిద్ధం చేయాలి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నష్టపోయిన ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా అధికారులు జాగ్రత్తలు వహించాలి

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన నష్టపరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వీలైనంత త్వరగా నివేదిక సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల వల్ల పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండి నష్ట నివారణ చర్యలు వేగవంతంగా చేపట్టారని అభినందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  ప్రజలకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. విపత్తు సమయంలో పాలన యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద సహాయక చర్యల్లో అధికారులు చూపుతున్న చొరవను అభినందించిన సీఎం వరద నష్టపరిహారానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి పారదర్శక నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపాలని సూచించారు. పంటల నష్టం, గృహ నష్టం, రహదారుల దెబ్బతినడం, మౌలిక వసతుల పునరుద్ధరణకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ కు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేయాలని, విధుల్లో అలసత్వం కనబరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోచారం డ్యామ్ మరమ్మత్తు పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు, పునరావాసం వంటి మౌలిక అవసరాలు తక్షణమే అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వరద సహాయంపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు వరదల వలన జరిగిన నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం ముందు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గౌరవ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవగాంధీ హన్మంతు, ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >