Posted on 2025-09-04 17:24:53
డైలీ భారత్, చంద్రంపేట: సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు..
ప్రతి ఏటా సెప్టెంబర్ 5 న జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఎంపిక చేసి సన్మానిస్తారు.. ఈ సంవత్సరము ప్రకటించినా ఉత్తమ ఉపాధ్యాయుల లిస్ట్ లో సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు గువలకొండ శ్రీనివాస్ భౌతికశాస్త విభాగంలో మరియు కైరి పద్మ ఇంగ్లీష్ విభాగంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యారు.విద్యారంగ అభివృద్ధికి కృషి చేసి, బోధనలో ప్రతిభ కనబరిచి, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులే ఈ అవార్డుకు ఎంపికయ్యారని. ఉపాధ్యాయ దినోత్సవం రోజున వీరి కృషికి గౌరవం లభించనుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. వీరిరువు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ఎం శ్రీనివాస్,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ కంది సుజాత రెడ్డి, ఉపాధ్యాయ బృందం కొండి కొప్పుల రవి,ముంజ రమ, వోద్యారపు మధు సుధన్,వేముల అంజలి, లత,త్రివేణి మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >