Posted on 2025-09-04 18:18:05
పరిశీలించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే
గణనాథుడికి పూజలు
ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన
డైలీ భారత్, వేములవాడ:గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేములవాడలో గురువారం వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శోభాయాత్రను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి పరిశీలించారు.
అనంతరం వినాయకుడికి పూజలు చేశారు. నిమజ్జన స్థలం వద్ద అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల భక్తి గీతాలు, ఇతర కళాకారుల మ్యాజిక్ షో భక్తులను అలరించింది. పిల్లలు, పెద్దలు ఆసక్తిగా తిలకించారు.
కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఆర్డీవో రాధాబాయి, తహసిల్దార్ విజయ్ ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >