Posted on 2025-09-06 16:27:49
కాంగ్రెస్, బిజెపి నాయకుల మధ్య రగిలిన వాగ్వివాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గణేష్ నిమజ్జనం శోభాయాత్రకు రాజకీయరంగు పులుముకుంది. ప్రతి ఏటా సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సార్వజనిక్ కమిటీ కన్వీనర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించడం సాంప్రదాయంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలు లేనప్పుడు జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. గత తొమ్మిది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరిగిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా దుబ్బలో జరిగిన శోభయాత్ర ప్రారంభం రాజకీయ రగడగా మారింది. సార్వజనిక్ గణేష్ మండలి కన్వీనర్ బంటు గణేష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉండగా వేడుకలకు ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఆయన కూడా జెండా ఊపేందుకు సిద్ధపడ్డారు. ముగ్గురు కలిసి చేయాల్సిన చోట ఒకరు మాత్రమే జెండా ఊపడంతో వివాదానికి కారణమైంది.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >