Posted on 2025-09-08 11:06:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు, భద్రాచలం తాజా ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు లు లంబాడీల హక్కులను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని అందుకే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎస్సీ జాబితాల నుండి లంబాడీల రిజర్వేషన్ను తొలగించాలని పిటీషన్ వేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. చౌహాన్ బాబు రామ్ నాయక్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ఆ ఇద్దరి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఎస్సీ జాబితాలో ఉంచాలని రాజ్యాంగం కల్పించిన తమ హక్కులను కాలరాసేందుకు వారు కుట్రలు పన్ని తమ రిజర్వేషన్లను దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వారిరువురూ తమ లంబాడి జాత్రికి క్షమాపణ చెప్పి వారు వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం రాష్ట్రవ్యాప్తంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కొర్ర గంగాధర్ నాయక్, నాయకులు జాదవ్ ప్రవీణ్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >