Posted on 2025-09-09 12:07:39
డైలీ భారత్, నార్సింగి: నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక 4 లక్షల లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల గ్రామానికి చెందిన వ్యక్తి ప్లాట్‌కి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్‌ను క్లియర్ చేయడానికి టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక 10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు మున్సిపల్ కార్యాలయంలో రెక్కీ వేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >