| Daily భారత్
Logo




పరీక్ష రాసేందుకు నిరాకరించిన ప్రొఫెసర్ పై కత్తితో దాడి చేసిన స్టూడెంట్

News

Posted on 2025-09-09 12:36:02

Share: Share


పరీక్ష రాసేందుకు నిరాకరించిన ప్రొఫెసర్ పై కత్తితో దాడి చేసిన స్టూడెంట్

డైలీ భారత్, నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఎం.టెక్ (ట్రాన్స్‌పోర్ట్) విద్యార్థి మజ్జి వినాయక పురుషోత్తం, ఒక ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేయడంతో కళాశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సెకండ్ సెమిస్టర్ పరీక్షల సమయంలో ఈ ఘటన జరిగింది. విజయనగరానికి చెందిన పురుషోత్తం పరీక్ష రాయడానికి కళాశాలకు వచ్చినప్పటికీ, సరైన హాజరు లేకపోవడంతో సివిల్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ గోపాలరాజు అతడిని పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు. హెచ్‌ఓడి అనుమతి తీసుకురావాలని సూచించినప్పటికీ, హెచ్‌ఓడి కూడా పరీక్ష రాయడానికి నిరాకరించారు. దీనికి ఆగ్రహం చెందిన పురుషోత్తం తిరిగి పరీక్షా కేంద్రానికి వచ్చి ప్రొఫెసర్ గోపాలరాజుతో వాగ్వాదం పెట్టుకున్నాడు.

వివాదం ఎక్కువ కావడంతో ప్రొఫెసర్ సెక్యూరిటీ సిబ్బందిని పిలవగా, పురుషోత్తం తన వెంట తీసుకువచ్చిన కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ దాడిలో గోపాలరాజుకు గాయాలు కావడంతో సహచర విద్యార్థులు అప్రమత్తమై దాడి చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ప్రొఫెసర్‌ను తక్షణం ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రకారం, నిందితుడు ముందుగానే రెండు కత్తులు తెచ్చుకోవడం వల్ల ఈ దాడి ప్రణాళికాబద్ధంగానే జరిగినట్లు తెలుస్తోంది. 70% హాజరు లేకపోవడంతో పరీక్షకు అనుమతి నిరాకరించడమే ఈ ఘటనకు కారణమని అధికారులు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, హింసతో సమస్యలు పరిష్కారం కాదని హెచ్చరించారు

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >