| Daily భారత్
Logo




పేద విద్యార్థిని చదువుకు ప్రభుత్వం ఆర్థిక భరోసా

News

Posted on 2025-09-09 13:48:50

Share: Share


పేద విద్యార్థిని చదువుకు ప్రభుత్వం ఆర్థిక భరోసా

లక్ష రూపాయల చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని తల్లిదండ్రులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పేద విద్యార్థిని చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది, చదువు మధ్యలో ఆగిపోకుండా కళాశాలలో చెల్లించాల్సిన ఫీజు కోసం ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 


తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడోజు ఆశ్రిత హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడవ తరగతి చదువుతుంది. కళాశాలలో ఫీజు చెల్లించేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఆర్థిక సహాయం చేయాలని హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించింది. స్పందించిన ప్రభుత్వం తగిన సహాయం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు సూచించారు. 

మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆశ్రిత తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఉన్నత విద్య అభ్యసించి, లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ కూతురు చదువుకు ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, సహకరించిన జిల్లా కలెక్టర్ కు ఆశ్రిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >