Posted on 2025-09-11 14:40:28
వేములవాడ అర్బన్ లోని కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ
డైలీ భారత్, వేములవాడ: విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక ఏఐ టూల్స్ పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
వేములవాడ అర్బన్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యాలయంలోని వంటగది, స్టోర్ రూము, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతి రోజు అందిస్తున్న భోజన, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు చుట్టూ అపరిశుభ్రత, రహదారి, విద్యాలయం భవనానికి ప్రహరీ లేనట్లు గమనించారు. విద్యాలయం ఆవరణను శుభ్రంగా చేయాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రోడ్డు, ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
పాఠాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని..
పాఠశాలలోని 7వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఎకనామిక్స్ కంప్యూటర్స్ పాఠాలను బోధించారు. ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. విద్యార్థులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు తరగతి గదికి వచ్చే ముందు పాఠాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వచ్చి విద్యార్థులకు సరిగ్గా విద్యాబోధన చేయాలని ఆదేశించారు.
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >