| Daily భారత్
Logo




నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పార్టీ నుండి సస్పెండ్ అయిన... జిల్లా జాగృతి నాయకులు మౌనమేల

News

Posted on 2025-09-11 15:44:35

Share: Share


నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పార్టీ నుండి సస్పెండ్ అయిన... జిల్లా జాగృతి నాయకులు మౌనమేల

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన నిజామాబాద్ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఇతర పార్టీ లోకి వెళ్తారా.. ఇన్నాళ్లు బీఆర్ఎస్ కు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలి గా అనుబంధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఆమె జాగృతిని రాజకీయ పార్టీగా స్థాపించి ఇన్నాళ్లు  తెలంగాణ జాగృతి కమిటీగా వ్యవహరించిన నాయకులను ఆమె స్థాపించే తెలంగాణ జాగృతి నేతలను తాను కొత్తగా పెట్టబోయే పార్టీలోకి ఆహ్వానించి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా వ్యూహం రచించనున్నారా అనే సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆమె అభిమానులు అనుచరులు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కవిత వీరాభిమాని బినోల సొసైటీ చైర్మన్ హనుమాన్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. అదే దారిలో ఇంకొంతమంది ఉన్నారా అనే సందేహం నెలకొంటుంది. ఇది ఇలా ఉండగా పార్టీ నుంచి గెలిచిన వారే పార్టీకి రాజీనామా చేసి కవితకు మద్దతు తెలుపుతుంటే తెలంగాణ జాగృతి నిజామాబాద్ శాఖ మాత్రం ఆమె సస్పెండ్ అయిన నాటి నుండి నోరుమెడపకుండా ఉండటం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్టీ నేతల కంటే తెలంగాణ జాగృతి నాయకులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు ముఖ్యంగా నిజామాబాద్ తెలంగాణ జాగృతి నాయకులకు అతి దగ్గరగా వారు ఎలాంటి సమస్యలున్న దగ్గరుండి పరిష్కరించే విధంగా కృషి చేశారు. కానీ తాజా రాజకీయ పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో కవిత సస్పెండ్ చేసిన ఆ పార్టీ అధినాయకత్వం పై కనీసం ఖండించకుండా  రాజకీయ విశ్లేషకులు కవిత అభిమానులు, అనుచరులు చర్చించుకుంటున్నారు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టైనా సరే తాము పార్టీ వైపే ఉంటమో లేదా మాజీ ఎంపీ కవిత వైపే ఆమెకు మద్దతుగా ఉంటామో నని చెప్పలేని పరిస్థితి నిజామాబాద్ జిల్లా తెలంగాణ జాగృతి నాయకుల పరిస్థితి. ఎలా అంటే ముందు నుయ్యి, వెనక గొయ్యి అనే పరిస్థితి తయారయింది జిల్లా తెలంగాణ జాగృతి నాయకుల పరిస్థితి.

Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >