Posted on 2025-09-12 08:21:59
డైలీ భారత్, కొనరావుపేట: కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ చైర్మన్ మాజీ జడ్పీటీసీ బండ నర్సయ్యకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిడ్డ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. నన్ను పార్టీలోకి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ పిరోజ్ పాషా,నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, వట్టిమల్ల గ్రామ శాఖ అధ్యక్షులు చెప్యాల రాజు,యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి మధు , మాజీ ఉపసర్పంచ్ పుంగం గౌడ్, దాదె సత్తయ్య, కర్రే శంకరయ్య, బండ రాములు, రమేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >