| Daily భారత్
Logo




జనాభా ప్రతిపాదన ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే రాహుల్ గాంధీ లక్ష్యం

News

Posted on 2025-09-12 10:08:07

Share: Share


జనాభా ప్రతిపాదన ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే రాహుల్ గాంధీ లక్ష్యం

తెలంగాణను రోల్ మోడల్ గా తీర్చిదిద్దటం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..

రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడి..

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జనాభా ప్రతిపాదన ప్రకారం ఎవరికి దక్కాల్సిన రిజర్వేషన్లు వారికి అందుతేనే సమాజంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం దక్కుతుందనేదే రాహుల్ గాంధీ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాహుల్ గాంధీ ప్రణాళిక పరంగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా ఈనెల 15 న కామారెడ్డి లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అందుకుగాను భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు. ఈ సభ ద్వారా భవిష్యత్ లో రాష్ట్రంలో చేపట్టబోయే మరిన్ని సంక్షేమ పథకాల ప్రకటన ముఖ్యమంత్రి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎరువులు కొరతకు కేంద్రం కారణం..రాష్ట్రానికి తక్కువ స్టాక్ ఇవ్వటం వల్ల రైతులకు నేడుఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రిజర్వేషన్ లపై రాష్ట్రాలకే అవకాశం ఇవ్వండి అని కేంద్రాన్ని కోరుతున్న పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున 42 శాతం బిసి రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదే నని ఆయన అన్నారు.

రిజర్వేషన్ లు కొలిక్కి వచ్చాకే స్థానిక సంస్థలకు వెళ్లాలి అనుకుంటున్నాం అని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అమిత్ రెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, నూడా చైర్మన్ కేశవేణు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నగేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >
Image 1

షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెండ్ చేసిన సీపీ తరుణ్ జోషి

Posted On 2026-07-11 15:02:55

Readmore >
Image 1

నా మొదటి ఆరు నెలల 6లక్షల జీతం.. హరీష్ అన్నకే...!!

Posted On 2026-07-11 14:10:21

Readmore >
Image 1

సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Posted On 2026-07-11 14:06:28

Readmore >
Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >
Image 1

పొలంపల్లి గ్రామ బీజేపీ సర్పంచ్ సస్పెండ్

Posted On 2026-07-11 13:45:00

Readmore >