Posted on 2025-09-12 11:35:51
కోనరావుపేట మండలంలో యూరియా పంపిణీ కేంద్రాల పరిశీలన
డైలీ భారత్, కోనరావుపేట: యూరియా కోసం వచ్చే రైతులు తమ వెంట తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ తీసుకురావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, సుద్దాల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో శుక్రవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, కలెక్టర్ పరిశీలించారు.
మండలానికి మొత్తం ఎన్ని బస్తాల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ను అడిగి తెలుసుకోగా, మొత్తం 1500 బస్తాలు వచ్చిందని కలెక్టర్ దృష్టికి డీఏఓ తీసుకువెళ్ళారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఎరువులు వినియోగించాలని సూచించారు. అవసరం ఉన్న మేరకే తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు.
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ
Posted On 2026-07-11 13:44:17
Readmore >