| Daily భారత్
Logo




జోస్ ఆలుక్కాస్ సామాజిక సేవలు అద్భుతం

News

Posted on 2025-09-13 13:58:41

Share: Share


జోస్ ఆలుక్కాస్ సామాజిక సేవలు అద్భుతం

మూడవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సమాజంలో విద్య వైద్య రంగాలకు జోస్ ఆలుక్కాస్ సంస్థ చేస్తున్న  సేవ కార్యక్రమాలు అద్భుతమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కొనియాడారు. శనివారం జోస్ ఆలుక్కాస్ *జువెలరీ షోరూం* మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జిల్లాలోని ప్రాధాన్యతా రంగాలైన ఆసుపత్రులకు, పాఠశాలకు  అవసరమైన  ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూరుస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం మూడో వార్షికోత్సవ  పురస్కరించుకొని చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలవడం గర్వకారణం అన్నారు.    నాలుగు ప్రభుత్వ పాఠశాలకు సుమారు రూ.6 .96 లక్షల విలువగల కంప్యూటర్ లు,  డిజిటల్ టీవీ, తాగునీటి శుద్ధి యంత్రం లాంటి మౌలిక సదుపాయాలు కల్పనకు  నిధులు *వెచ్చించడం* హర్షణీయం అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. బంగారు, *వజ్రాభరణాల* వ్యాపారంలో నమ్మకమైన సంస్థగా ప్రఖ్యాతి *గడించిన* జోస్ ఆలుక్కాస్ *జువెలరీ షోరూం*  వ్యాపారం లో అభివృద్ధి చెంది సమాజసేవలను  విస్తరించాలని కోరారు. ప్రతి ఒక్కరు సంస్థ చేస్తున్న సేవలను  ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.  సమాజసేవలో వివిధ రంగాల అభివృద్ధిలో  భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 13 నుంచి 19 వరకు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి రూ. 75 వేల విలువగల బంగారు ఆభరణాలు కొనుగోలు పై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ పాఠశాలకు ఎంపీ చేతుల మీదుగా సి ఎస్ ఆర్ ఫండ్ చెక్కులను అందజేశారు. కేక్ కట్ చేసి మూడో వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ దనిష్ , అసిస్టెంట్ మేనేజర్ సజయ్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, పి ఆర్ ఓ పిప్పెర నరేందర్, తదితర సిబ్బంది, ప్రతినిధులు పాల్గొన్నారు.


Image 1

"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"

Posted On 2026-07-11 13:59:01

Readmore >
Image 1

శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్

Posted On 2026-07-11 13:49:13

Readmore >
Image 1

రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి

Posted On 2026-07-11 13:46:55

Readmore >
Image 1

షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Posted On 2026-07-11 13:46:16

Readmore >
Image 1

పొలంపల్లి గ్రామ బీజేపీ సర్పంచ్ సస్పెండ్

Posted On 2026-07-11 13:45:00

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ

Posted On 2026-07-11 13:44:17

Readmore >
Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >