| Daily భారత్
Logo




స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బిజెపి జెండా ఎగరవేస్తాం : నిజామాబాద్ ఎంపీ అర్వింద్

News

Posted on 2025-09-13 16:35:41

Share: Share


స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బిజెపి జెండా ఎగరవేస్తాం : నిజామాబాద్ ఎంపీ అర్వింద్

స్థానిక ఎన్నికలలో బీజేపీ టికెట్ కోసం అన్ని పార్టీల నాయకులు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బిజెపి జెండా ఎగరవేస్తాం : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ 

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యకతన సేవా పక్షం జిల్లా కార్యాశాల ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ... 

జిల్లాలో స్థానిక సంస్థలన్నీ బీజేపీ కైవసం చేసుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు బీజేపీ టికెట్ కోసం క్యూ కడుతున్నారని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలువదు అని స్వయంగా ఫోన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు మాకు బీజేపీ టికెట్ ఇవ్వండి అని మోర పెట్టుకుంటున్నారు జిల్లాలో అన్ని స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంటుంది కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి  నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు  ప్రతి రంగంలో బీజేపీ ప్రభుత్వమే కృషి చేస్తోంది. తెలంగాణలో కూడా అదే విధంగా బీజేపీ జెండా ఎగరబోతుంది” అని తెలిపారు. సేవా పక్షం లో భాగంగా ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అని అన్నారు.కార్యక్రమంలో పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి,జిల్లా ప్రదాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షలు రాంచందర్, పాలేపు రాజు, నర్సారెడ్డి,జిల్లా, నగర, మండల స్థాయి నాయకులు, పాల్గొన్నారు.

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >