Posted on 2025-09-15 16:21:44
డైలీ భారత్, హైదరాబాద్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేశ్ బాబు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రేషన్ డీలర్ల ఆశాజ్యోతి ఎనుముల రేవంత్ రెడ్డి ని కలసి, రాష్ట్ర రేషన్ డీలర్ల ప్రధాన సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు.
ముందుగా తీసుకున్న అపాయింట్‌మెంట్ ప్రకారం నిన్న రాత్రి సీఎం ఆఫీస్ పీఏ ఫోన్ చేసి, సోమవారం ఉదయం 8 గంటలకు తనతో పాటు మరొకరిని తీసుకుని సీఎం నివాసానికి రావాలని బత్తుల రమేశ్ బాబుకు తెలియజేయగా, ఈ రోజు ఉదయం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లి హాజరయ్యారు.
ఉదయం 7.30 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని దర్శించి, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం తొందరగా మంజూరు కావాలని, ముఖ్యమంత్రి కరుణించాలనే ప్రార్థన చేసి రమేష్ బాబు ఉదయం 8 గంటలకు సీఎం నివాసానికి చేరుకున్నారు. అక్కడ VIP విజిటర్స్ హాల్‌లో కూర్చుని ఉండగా, గౌరవాధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి రమేశ్ బాబును పిలిపించగా, ఉదయం 11 గంటలకు సీఎం గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం కలిగింది.
సీఎం కి నమస్కరించి, షాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసిన అనంతరం, రాష్ట్ర డీలర్ల తరఫున రమేశ్ బాబు వినతి పత్రాన్ని సమర్పించారు. దానిని చిరునవ్వుతో స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “మీ గురించి రాజేందర్ అన్న చాలా సార్లు చెప్పారు. మీ నాయకత్వం గురించి నాకు చాలా రోజుల నుండే తెలుసు” అని అభినందించారు.
దానికి ప్రతిగా రమేశ్ బాబు మాట్లాడుతూ, “మా 17,000 మంది డీలర్లు మీ మీదే ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మి ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చాం. గౌరవ వేతనం కోసం అందరం ఎదురుచూస్తున్నాం” అన్నారు.
సీఎం సరదాగా “మరి కమిషన్ పెంపు వద్దా?” అని ప్రశ్నించగా, రమేశ్ బాబు “అదీ పెంచాలని కోరుతున్నాం” అని అభ్యర్థించారు.
అందుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి “పేదలకు సన్నబియ్యం అందిస్తున్నాక, డీలర్ల పట్ల గౌరవం మరింత పెరిగింది. మీ ఆశలు వమ్ము కావు. డీలర్లకు తప్పకుండా గౌరవ వేతనం ఇస్తాం. కొద్దిరోజులు ఓపిక పట్టండి. త్వరలోనే రాజేందర్ అన్న ద్వారా మిమ్మల్ని మళ్లీ ఆహ్వానించి, మీ కోరికలను నెరవేర్చుతాను” అని హామీ ఇచ్చారు.
అదే విధంగా “దశల వారీగా మరిన్ని వస్తువులను సరఫరా చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. త్వరలోనే అందరికీ మెరుగైన ఫలితాలు అందుతాయి” అని ముఖ్యమంత్రి తెలిపారు.
సీఎం నోట రాష్ట్ర రేషన్ డీలర్లకు గౌరవ వేతనం మంజూరు చేస్తామని స్పష్టంగా ప్రకటించడం అత్యంత “శుభదాయకం” అని చెప్పవచ్చు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >