| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను ఎందుకు బదిలీ చేయాలి…?

News

Posted on 2025-09-19 19:33:52

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను ఎందుకు బదిలీ చేయాలి…?

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఎంతోమంది కలెక్టర్లను చూశాను కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వంటి కలెక్టర్ ని ఇంతవరకు చూడలేదు, ఇంతకుముందున్న కలెక్టర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లు చెప్పినట్టు చేసేవాళ్లు కానీ ఇప్పుడున్న మా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటూ తేడాలు లేకుండా నిజమైన సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు ఇలాంటి కలెక్టర్ ని నేను చూడడం ఇదే మొదటిసారి అంటూ అభిమానాన్ని వ్యక్త పరుస్తున్న రాజన్న సిరిసిల్ల ప్రజలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను ఎందుకు బదిలీ చేయాలి…? 

ఇందుకేనా... 

అక్రమార్కులను విక్రమార్కుడిలా వేటాడుడుతున్నందుకా….?

మోఖా మీద గుంట భూమి లేకున్న ఎకరాల కొద్ది ప్రభుత్వం నుండి పట్టా పొంది అక్రమంగా రైతు బంధు పేరుతో లక్షలు కొల్లగొట్టిన భూ రాబందుల పట్ల సింహ స్వప్నంలా మారినందుకా…?

అన్ని అర్హతలు ఉన్న న్యాయం దక్కక కాళ్లు అరిగి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభాగ్యులకు ఆరాధ్యంగా మారినందుకా…?

అక్రమ ఇసుకతో కోట్లు కొల్లగొట్టి మోనోపాలీ లా శాసించిన స్మగ్లర్ల ఆట కట్టించినదుకా…?

అక్రమ నియామకాలను రద్దు చేసి అర్హులకు పట్టం కట్టినందుకా….?

ఎలాంటి అంగ బలం, అర్ధ బలం లేని వాళ్లకు ఆపన్న హస్తం ఇస్తున్నందుకా…?

ప్రభుత్వ నియామకాల్లో రాజకీయ జోక్యానికి, పైరవీలకు తావు ఇవ్వకుండా ప్రతిభనే కొలమానం చేసినందుకా…?

అధికార దర్పంను ఆమడ దూరంలో ఉంచి నిరుపేదలకు సేవకుడిగా మారినందుకా…?

గత ప్రభుత్వం హయాంలో కట్టడి కాని సహజ వనరుల దోపిడీని కంటి చూపుతో నిలువరించినందుకా….?

బ్లాక్ మెయిలర్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తూ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నందుకా…? 

ప్రతి ప్రభుత్వ పథకం అర్హులకు అందేలా చేస్తున్నందుకా…అంటూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా నిరంతరం ప్రజా అభ్యున్నతి కి పాటు పడుతున్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పట్ల కొందరు నేతలు చేస్తున్న ఆరోపణలపై ప్రజలు ఒకింత ఆగ్రహంగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

ప్రజా సంక్షేమం వదిలి ప్రతిపక్షం ట్రాప్ లో పడిన అధికార పార్టీ నేతలు కలెక్టర్ పై చేస్తున్న విమర్శలను ప్రజలు ఈసడించు కుంటున్నారు. 

పాలనలో లోటు పాట్లను సమన్వయంతో పరిష్కరించు కోవడం జరుగుతుంది కానీ ఇలా ఒక నిజాయితీ గల అధికారిపై బ్లేమ్ గేమ్ ఏంటని నెటిజన్లు మండి పడుతున్నారు. 

పార్టీలకు అతీతంగా ఏకమైన అక్రమార్కుల కుట్రలు కుతంత్రాల కు ప్రభుత్వం లొంగకుండా కలెక్టర్ సందీప్ కుమార్ ను దీర్ఘ కాలం కొనసాగిస్తే ఏళ్లనాటి జాడ్యం తొలగి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథం లో ముందుకు పోతుందని ప్రజలు అభి ప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ పెద్దలు భూ దోపిడీ దారుల కుట్రలకు తావు ఇవ్వకుండా కలెక్టర్ సమర్ధ వంతంగా ప్రజలకు సేవ చేసేందుకు నైతిక స్థైర్యం ఇవ్వాలని  జిల్లా ప్రజలు కోరుతున్నారు.

గుంట కాడి నక్కల కలెక్టర్ బదిలీ కోసం ఎదురు చూస్తున్న అక్రమార్కుల ఆశలు అడియాశలు తప్ప వారి కోరికలు తీరే అవకాశం కనుచూపు మేరలో కూడా లేక పోవడం కోస మెరుపు.

కలెక్టర్ పై అభిమానాన్ని చూపిస్తున్న పలువురు

# stand With collector 

# support our collector

అని హ్యాష్ ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు... 

Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >