Posted on 2025-09-21 06:23:25
ఎండు గంజయి,ఆల్ప్రా జోలం, యం.డి.యం.ఎ చట్టప్రకారమే దహనం, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
583-కిలోల ఎండు గంజాయి, 1.777 కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల యం.డి.యం.ఎ ను ఇన్సినిరేషన్ పక్రియ ద్వారా దహనం,
సంగారెడ్డి జిల్లా: డైలీ భారత్ న్యూస్:సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం నమోదైన 20 కేసులలో సీజ్ చేయబడిన ప్రభుత్వ నిషేధిత 583-కిలోల ఎండు గంజాయి, 1.777 కిలోల ఆల్ప్రాజోలం, 980 గ్రాముల యం.డి.యం.ఎ ను చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజు నాడు సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలలోని మెడీకేర్ పరిశ్రమలో ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యన్.డి.పి.యస్. యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ప్రభుత్వ నిషేదిత ఎండు గంజాయి, ఆల్ప్రాజోలం, యం.డి.యం.ఎ ను దహనం చేయడం జరిగిందని అయన అన్నారు.
కొందరు అక్రమార్జనలో భాగంగా అక్రమ ఆల్ప్రాజోలం తయారీ, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి లాగుతున్నారని అన్నారు. జిల్లాలో అసాంఘీక, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలను అరికట్టడానికి జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టిమ్స్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ దాడులు చేపట్టడం జరిగిందని, జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించి, సరఫరా చేసినా, లేదా సాగు చేసిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ఈ డ్రగ్ డిస్పోజల్ కార్యక్రమంలో ఎస్పీ వెంబడి సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్యగౌడ్, పటాన్ చెర్వు డిఎస్పీ ప్రభాకర్, వర్టికల్ డిఎస్పీ సురేందర్ రెడ్డి, మెడికేర్ ఎన్విరాన్‌మెంటల్ పరిశ్రమ మేనేజర్ శివారెడ్డి, డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ బి.రమేష్, ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, పటాన్ చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంబంధిత ఎస్.హెచ్.ఓ. లు పాలుగోన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >