| Daily భారత్
Logo




ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలలో ఆటలాడుతున్న జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థ

News

Posted on 2025-09-21 11:50:04

Share: Share


ర్యాంకుల కోసం  విద్యార్థుల జీవితాలలో ఆటలాడుతున్న జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యా సంస్థ

విద్యాసంస్థ చేసే ఇబ్బందులకు విద్యార్థులు తాళలేక సంవత్సరానికి ఒక్కరు ఇబ్బందుల పాలు..

విద్యాసంస్థ భవనం పై నుండి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ విద్యార్థి

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.. విద్యార్థి సంఘాల ఆందోళన

విద్యార్థి పరిస్థితి విషమం..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ర్యాంకుల సాధన కోసం ఏమీ తెలియని పసి విద్యార్థుల ను సంవత్సరానికి ఒకరు చొప్పున టార్గెట్ చేస్తూ బలి తీసుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థలు. తాజాగా నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన పాలాజీ, శిల్పల కుమారుడు సుమిత్ ఈ సంవత్సరం కాకతీయ విద్యాసంస్థలు 8వ తరగతిలో విద్యభ్యాసం కోసం ఈ సంవత్సరం విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలో  చేర్పించారు. అయితే ఈ శుక్రవారం ఎస్ఏ1, ఎస్ఏ 2 పరీక్షలు పాఠశాల యాజమాన్యం నిర్వహించారు. ఈ పరీక్షలు సదరు విద్యార్థి మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారంటూ క్లాస్ రూమ్ లో ఉన్న టీచర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్దకు విషయం తీసుకెళ్లారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని మందలించడంతో తీవ్ర మణస్థాపంతో పాఠశాల భవనం రెండవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక్కడి నుంచి మొదలైంది. ఆ విద్యాసంస్థ యొక్క నాటకీయ పరిణామం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని బయటకు రానివ్వకుండా జాగ్రత్తగా వహించి ఎవరికీ తెలియకుండా వారి తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన వారి తల్లిదండ్రులు మానసికంగా తీవ్రంగా కుంగి పోయారు. బయటకు పొక్కకుండా చూడాలని అవసరమైతే విద్యార్థి చికిత్స నిమిత్తం అవసరమైన ఖర్చు తామే భరిస్తామని నచ్చచెప్ప  సాగారు దీంతో విద్యార్థి తల్లి విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త వహించారు. చివరకు విషయం ఆదివారం మధ్యాహ్నం బయటకు రావడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. కాగా

దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు వెల్లడించారు. రెండవ అంతస్తు నుండి కిందికి దూకడంతో విద్యార్థి కాలు విరిగిపోగా, తలకు, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో బాబుకు రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత పోలీసులను వివరణ కోరగా విద్యార్థి ఆత్మహత్యయత్నం చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరోసారి విచారణ జరుపుతామని చెప్పడం పోలీసుల తీరుపై అనుమానాలకు తావు కల్పిస్తుంది. పాఠశాల యజమాన్యాన్ని కాపాడేందుకే విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం పై పోలీసులు సీరియస్ గా పరిగణించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే విద్యా సంస్థలు గత సంవత్సరం కూడా ఓ విద్యార్థి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా  అనారోగ్యంతో బోధన్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఇంకా ఎంతమంది  విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంటారో పాఠశాల యాజమాన్యమే సమాధానం చెప్పాలి.

Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >