| Daily భారత్
Logo




చిన్మయ గీతా పఠన పోటీలలో సత్తా చాటిన సిరిసిల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు

News

Posted on 2025-09-22 14:56:30

Share: Share


చిన్మయ గీతా పఠన పోటీలలో సత్తా చాటిన సిరిసిల్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు

డైలీ భారత్, సిరిసిల్ల: చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము పాఠశాల స్థాయి నుండి జాతీయస్థాయి వరకు బాల బాలికలకు  నిర్వహిస్తున్న చిన్మయ గీతా పఠన పోటీలలో భాగంగా ఈ సంవత్సరము కూడా చిన్మయ గీతా పఠన పోటీలు 2025 నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గాంధీ నగర్ సిరిసిల్లలో చదువుతున్న 130 మంది బాల బాలికలకు మరియు శ్రీ భక్తాంజనేయ శివ పంచాయతన దేవస్థానం బీవైనగర్ సిరిసిల్లలో ప్రతి ఆదివారం 9 గంటల నుండి 10 గంటల వరకు  నిర్వహించబడుతున్న చిన్మయ బాలవిహార్ కార్యక్రమం ద్వారా 30 మందికి పైగా విద్యార్థులకు శ్రీ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమప్రాప్తియోగములోని శ్లోకాలు పఠనము చేయడం నేర్పించడం జరిగింది వీరిని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ గ్రూపులుగా విభజించి వారి వారి స్థాయిలలో ప్రాథమిక స్థాయి పోటీలను నిర్వహించి ప్రతి గ్రూపు నుండి ప్రథమ స్థాయిలో నిలిచిన బాలబాలికలను కరీంనగర్ పాత జిల్లాస్థాయి పోటీకి పంపించడం జరిగింది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము అశోక్ నగర్ కరీంనగర్లో నిర్వహించబడిన జిల్లాస్థాయి చిన్మయ గీతా పఠన పోటీలు-2025 లో సిరిసిల్ల నుండి శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చదువుతున్న దూస రుత్విక్, కొయ్యడ స్వస్తిక్, కొక్కుల ప్రశస్త, మ్యాన శ్రీహిత, గాజుల తేజశ్రీ మరియు చిన్మయ బాలవిహార్ నుండి కుడిక్యాల తేజస్వి పాల్గొన్నారు జిల్లా స్థాయి పోటీలో చిరంజీవి మ్యాన శ్రీహిత డీ గ్రూపులో ప్రథమ స్థానము, కుడిక్యాల తేజస్వి ఈ గ్రూపులో ద్వితీయ స్థానము గాజుల తేజశ్రీ తృతీయ స్థానములలో నిలిచి బహుమతులను పొందినారు అంతేకాకుండా మ్యాన శ్రీహిత 2025 నవంబర్ 9వ తేదీన కడపలో నిర్వహించబడే రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనే అవకాశాన్ని సాధించింది బహుమతులు పొందిన చిన్నారులను మరియు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన చిన్నారి శ్రీహితను చిన్మయ మిషన్ సిరిసిల్ల అధ్యక్షులు  సజ్జనం శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లకావత్ మోతిలాల్  ఉపాధ్యక్షులు  గజ్జెల్లి రామచంద్రం శ్రీపతి కోటేశ్వరి  ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ కోశాధికార మేరుగు మల్లేశం కార్యవర్గ సభ్యులు జక్కని రమేష్ వేముల శంకర్ వెంగళ కమలాకర్ సజ్జనం సృజన లకావత్ రాజమణి మేరుగు లలిత నల్ల రాజేశ్వరి మరియు సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు వేణు కిరణ్ మరియు సమస్త ఉపాధ్యాయ బృందం చిన్నారులను అభినందించారు విద్యార్థులకు శ్లోకాల పఠనమును నేర్పించి శిక్షణ ఇచ్చిన నల్ల సత్యనారాయణ ని అందరూ అభినందించారు బహుమతులు గెలుచుకున్న చిన్నారులనందరిని చిన్మయ మిషన్ కరీంనగర్ సెంటర్ ఆచార్యులు బ్రహ్మచారి అక్షయ చైతన్య అభినందిస్తూ వారికి శిక్షణనిచ్చిన ఆచార్యులందరికీ ధన్యవాదములు తెలియజేశారు 


Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >