Posted on 2025-09-22 15:07:27
సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం బీభత్సం
పోలీసులను పరిగెత్తించి కొట్టి రాళ్లతో దాడి చేశారు
ఫ్యాక్టరీ యాజమాన్యం,కార్మికుల ప్రతినిధులతో పోలీసుల చర్చలు
డైలీ భారత్, సూర్యపేట: సూర్యాపేట జిల్లాలో బీహార్ కూలీలు బీభత్సం చేశారు. రోడ్లపై వీళ్ల విధ్వంసం చూసి భయంలో పరుగులు తీశారు పోలీసులు. జనం అయితే వణికిపోయారు. పాలకీడు మండలం జానపహాడు దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన ఘటన సంచలనంగా మారింది.
సూర్యాపేట జిల్లా పాలకవీడులోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు గాయపడి మరణించాడు. అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ బీహార్‌కు చెందిన వందల మంది కార్మికులు ఫ్యాక్టరీ గేటు వద్ద ఆందోళన చేశారు. ఈ సమయంలో వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులు పైకి దాడి జరిగి, పలువురు పోలీసులు గాయపడ్డారు.
దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. అతని మరణంపై న్యాయం కోరుతూ ఫ్యాక్టరీ ముందు బీహార్ కార్మికులు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేశారు. ఈ దాడి కారణంగా పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సమాచారం ఉన్నతాధికారులకు చేరడంతో అదనపు బలగాలను సంఘటనా స్థలానికి పంపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు కార్మికుల ప్రతినిధులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిరసన హక్కు ఉన్నప్పటికీ, పోలీసులు దాడి చేయటం సరైన పద్ధతి కాదని, ఇరు వర్గాలకు శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తగిన సహాయం చేస్తే పరిస్థితిని అదుపులోకి తెచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >