| Daily భారత్
Logo




ఘనంగా గోమాతకు సీమంతం

News

Posted on 2025-09-27 03:09:35

Share: Share


ఘనంగా గోమాతకు సీమంతం

వరంగల్ / నర్సంపేట, డైలీ భారత్ న్యూస్: మనిషి కూడా ప్రకృతిలో ఓ భాగమే అన్న విషయం మర్చిపోతున్న రోజులివి. కాలంతోపాటు సాంకేతికతతో యంత్రాల నడుమ అసలు ప్రకృతి ఉనికినే ప్రశ్నార్థకంగా చేస్తున్న కాలమిది. ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒకచోట కన్న పిల్లల్ని కూడా చూడకుండా కడతేరుస్తున్న ఈ సంస్కృతికి చంపపెట్టుల వినూత్నంగా ఓ మూగజీవిని సాకి ఆపై పెంచుకున్న ప్రేమను ఒకంతగా ప్రస్తుత ప్రపంచానికి నిలువెత్తు సాక్షగా ప్రేమను అమ్మతనాన్ని అమ్మానాన్నల బంధాన్ని మూగజీవులను ప్రేమించే దిశగా చూపేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టి ఆ మూగజీవికి అమ్మ నాన్నల వెన్నంటే ఉండి సీమంతం చేసి ప్రకృతిలోని జీవులతో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. అందులో భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న గోవుల కోసం కొంతమంది మానవతామూర్తులు గోశాలలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఓ గోశాల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రం చింతగట్టులోని మహర్షి గోశాల నుండి   వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరి పల్లె గ్రామానికి చెందిన పెండ్యాల సురేందర్ వృత్తిరీత్యా గత 30 సంవత్సరాల నుండి గోపాలమిత్రగా పనిచేస్తున్నాడు గోవుల మీద పెంచుకున్న  మమకారంతో ఒక సంవత్సరం వయసు గల గోవుని ఐదు సంవత్సరాల క్రితం తెచ్చుకొని గౌరీగా నామకరణం చేసి పోషిస్తున్నాడు. ఈ క్రమంలో యుక్త వయసుకు వచ్చిన (గోవు). గౌరికి కృత్రిమ గర్భాధారణ చేపించి గర్భం దాల్చి ఆరు నెలల నుండి ఏడవ నెల పడిన క్రమంలో  రెండు రోజుల క్రితం గ్రామం లోని ప్రతి ఇంటికి వెళ్లి గౌరీ సీమంతానికి అతిధులను ఆహ్వానించే కార్యక్రమం చేపట్టి శుక్రవారం రోజు   సురేందర్ ఇంటి ఆవరణంలో ఘనంగా అంగరంగ వైభవంగా సీమంతం ఏర్పాట్లు ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమం లో పెండ్యాల సురేందర్ మాట్లాడుతూ గోమాతను హిందువులు దేవతగా భావిస్తారు, అందుకే ఈ ఆరాధన. 

ప్రకృతిలోని జీవుల పట్ల మనిషికున్న అనుబంధాన్ని గుర్తుచేసేందుకు ఇలా చాలా చోట్ల చేయడంజరిగిందని.గోవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని నమ్మకంతో కార్యక్రమం చేపట్టినట్టు  తెలిపారు. ఈ కార్యక్రమం మొదట గా ఇంటి ఆడబిడ్డగా భావించిన (గౌరీకి) గోమాతకు పసుపు కుంకుమ రాసి నూతన వస్త్రాలు  సమర్పించి, గోకుల దక్షణాలు చేశారు. అర్చకులు మంత్రాలు చదువుతూ మంత్రోచ్ఛారణతో పూజలు నిర్వహించగా,స్థానిక

మహిళలు గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి, అక్షింతలు వేసారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అనంతరం వేడుకలో పాల్గొన్న అందరికీ తీర్ధప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు.

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >