| Daily భారత్
Logo




జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు

News

Posted on 2025-09-27 14:18:39

Share: Share


జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు

వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జెడ్.పి.టి.సి, ఎం పి.పి స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్ లు ఖరారు చేయడం జరిగిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్ లో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డిప్యూటీ సీ.ఈ.ఓ సాయన్నలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 31 జెడ్.పి.టి.సి, ఎం పి.పి స్థానాల కోసం ఎస్.సి, ఎస్.టి, బి.సి, జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన, నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్.సి, ఎస్.టి రిజర్వేషన్లు, బీ.సీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బి.సి రిజర్వేషన్ కేటాయింపులు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని మొత్తం 31 జెడ్.పి.టి.సి స్థానాలకు గాను ఎస్.టిలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఎస్.సి లకు 5 జెడ్.పీ.టీ.సి స్థానాలు రిజర్వ్ కాగా, మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీ.సి లకు 13 స్థానాలు రిజర్వ్ కాగా, వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని వివరించారు. అదేవిధంగా జిల్లాలోని 31 ఎం.పీ.పీ స్థానాలకు గాను ఎస్.టిలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఎస్.సి లకు 5 ఎం.పీ.పీ స్థానాలు రిజర్వ్ కాగా, మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీ.సి లకు 13 స్థానాలు రిజర్వ్ కాగా, వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు.

Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >