| Daily భారత్
Logo




అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీ పార్టీది

News

Posted on 2025-09-27 17:47:32

Share: Share


అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీ పార్టీది

హక్కుల సాదించాలంటే పోరాటాలు ఒక్కటే మార్గం

కార్మిక కర్షక సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటాలు చేస్తాం

ఎఐటియుసి పోరాటాల ఫలితం 50 కిలోల బస్తాలు

హామాలీలకు సమగ్ర చట్టం రావాలి

కమ్యూనిస్ట్ పార్టీ లతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం చేస్తాం

సిపిఐ ఎమ్మెల్యే, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబ శివ రావు

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

అర్హులైన కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

 డైలీ భారత్ న్యూ,స్ నిజామాబాద్:అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీ పార్టీదని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుందని కార్మిక కర్షకుల శ్రమను దోపిడి చేసి బడా బడా నాయకులకు దోచిపెడుతుందని సిపిఐ ఎమ్మెల్యే, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబ శివ రావు అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డు హమాలి, దడువాయి, చాట, స్వీపర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 2 వ రాష్ట్ర మహా సభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమా మహేశ్వర హాల్ లో  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రద్ధ నంద్ గంజ్ హమాలీ జిల్లా భవనం నుంచి శివాజీ చౌక్, రైల్వే గేట్  

అవుట్ గేట్ మీదిగా ఉమా మహేశ్వర హాల్ వరకు వేలాది మంది ఏఐటియుసి మార్కెట్ యార్డు సంఘాల ఆధ్వర్యంలో జండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ చేతుల మీదుగా జండా ఆవిష్కరించారు. ఈ మహాసభలకు  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య అధ్యక్షత వహించారు. 

ఈ మహా సభల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎమ్మెల్యే, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబ శివ రావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, 

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

బాల్ రాజ్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహా, సహాయ కార్యదర్శి ప్రవీణ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  కంకర భూమయ్య, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ 

విచ్చేశారు. అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబ శివ రావు మాట్లాడుతూ నిజామాబాద్ లో సిపిఐ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహా సభ ఘనంగా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఏఐటియుసి చేసిన పోరాటాల ఫలితంగానే 50 కిలోల బస్తాలు రావడం గర్వకారణమన్నారు.

పోరాటాల వల్లనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. 

హామాలీలకు సమగ్ర చట్టం రావాలన్నారు. చట్టం వస్తే అన్ని  అందులో పొందుపరుస్తారని, దింతో న్యాయం జరిగిందన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు చట్టం ఉందని గుర్తు చేశారు. 

కమ్యూనిస్ట్ పార్టీ లతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుటుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్ర జండా సత్తా చాటలన్నారు.

కమ్యూనిష్టులు భారతంలో కృషుడి లాంటి వారని, కమ్యూనిస్టులు ఏ వైపు ఉంటే ఆ వైపు బలం ఉంటుందన్నారు. ఎలాంటి స్వార్థం లేని సిద్ధాంతాలు గల పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం సంపద ను అదానీ, అంబానిలకు దోచి పెట్టీ సబ్బండ వర్గాలను మోసం చేస్తుందన్నారు. 

కార్పొరేట్ సంస్థల్లో తక్కువ మంది చేతిలో ఎక్కువ సంపద కుప్పలు కుప్పలుగా ములుగుతుందన్నారు. 

కమ్యూనిస్ట్ లు చేసే పోరాటం రాహుల్ గాంధీ కూడా చేస్తున్నారని,  బీజేపీ చేస్తున్న అన్యాయాలను బయటకు తీసుకువస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తుందని, ఏ దేశంలోకి వెళ్ళిన, ఏ ఖండంలోకి వెళ్లిన ఎర్ర జెండా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కూలీ రేట్లు ఒకే విధంగా ఉండాలని, కార్మికుల వయసు 58 నుంచి 65 వరకు పెంచాలని, ప్రభుత్వం పిఎఫ్, ఈ ఎస్ ఐ అమలు చేయాలన్నారు.

పాత చట్టాలు రద్దు చేసి కొత్త చట్టాలు తీసుకురావాలి. రైతుల నుంచి కొంత సెస్ ద్వారా, కార్మికుల ద్వారా, ప్రభుత్వం  ద్వారా కొంత జమజేసి కార్మికులకు పెన్షన్ ఇచ్చేలా చూడలన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి బారం పడకుండా ఉంటుందని ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలన్నారు. ఆసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు 

ప్రభుత్వం విద్యా, వైద్యం, పెన్షన్ తో పాటు గుడు కల్పించాలన్నారు. అనంతరం ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కార్మికులకు అండగా ఉంటామన్నారు.

గత పది ఏళ్లలో మార్కెట్ యార్డ్ ఉందా లేద ఆన్నట్టుగా ఉండేదని, రైతు బిడ్డను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన 

తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కళకళలాడుతుందన్నారు. మార్కెట్ యార్డ్ కార్మికులకు అండగా మేముంటామని అన్నారు.  130 మందికి ఇల్లు లేవని నా దృష్టికి వచ్చిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. 65 సంవత్సరాల పెంపు  ఈఎస్ ఐ, ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెతామన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి లక్ష రూపాయలు ఇచ్చేలా చూస్తామన్నారు. సిపిఐ మిత్ర పక్ష పార్టీ అని తప్పకుండా కార్మిక కార్థకులకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మిక కర్షక పార్టీ అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నమన్నారు. 200 కోట్ల మహిళలు బస్సులలో ప్రయాణించారని, 6800 కోట్లు మహిళ్ళకు మిగిలిపోయాని గుర్తు చేశారు.సమస్యలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసేలా చూస్తామన్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ల సంఘం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ..

మార్కెట్ లో కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని  ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు.

గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వం కార్మికుల పట్ల చిన్న చూపు చూసారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మార్కెట్ లో లైసెన్సులు రెన్యువల్ చేయడం జరిగిందన్నారు.

వ్యాపారస్తులను కొంత ఇబ్బంది పెట్టిన గాని కార్మికులను మాత్రం ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో పాటు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహాయ సహకారాలతో మార్కెట్ అభివృద్ది కి నా వంతు కృషి చేస్తానని అన్నారు. మార్కెట్ యార్డు లో  రైతులకు, కార్మికుల కోసం ఉచిత భోజన క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నమన్నారు.సిర్ప లింగం ఆధ్వర్యంలో కళ ప్రదర్శన ఆకట్టుకుంది.

కార్యక్రమంలో  మార్కెట్ యార్డ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మునీశ్వర్, ఏఐటిసి  రాష్ట్ర కార్యదర్శి విలాస్, వరంగల్ మార్కెట్ యార్డ్ యూనియన్ అధ్యక్షులు రమేష్, జనగామ జిల్లా మార్కెట్ యార్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శివాజీ వేణుమామల మార్కెట్ అధ్యక్షులు కృష్ణ జనగామ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు యాకూబ్. నిజామాబాద్ జిల్లా హమాలీ యునియన్ అధ్యక్షులు పరుశురాం,  జిల్లా దడువాయి యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస గౌడ్, జిల్లా గుమస్తా అధ్యక్షులు బాలాంజనేయులు, కూరగాయ వర్తకుల సంఘం అధ్యక్షులు కోబులింగం, హమాలి కార్యదర్శి శ్రీహరి, చాటా వర్కర్ యునియన్ అధ్యక్షురాలు అనసూయ, కూరగాయల వార్తకుల సంఘం ప్రధాన కార్యదర్శి కండ్లకోయ ప్రసాద్,  వ్యవసాయ మర్చంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కమల్ కిషోర్ ఇనాని, మల్లేష్, స్వరూప రాణి, వివిధ జిల్లాలకు చెందిన మార్కెట్ యార్డ్ వర్కర్ మహిళలు ,పురుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >