| Daily భారత్
Logo




హత్య కేసు లో పది మంది నేరస్తులను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు

News

Posted on 2025-09-29 16:15:51

Share: Share


హత్య కేసు లో పది మంది నేరస్తులను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు

సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్ మర్డర్ కేసు

కుసుమవారిగూడెం గ్రామం దగ్గర జరిగిన హత్య కేసు లో పది మంది నేరస్తులను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు.

- పాత గొడవల నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన నిందితులు.

- సమాజంలో అభద్రతాభావం సృష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యల తప్పవు.

- పిడి యాక్ట్ సైతం నమోదు చేస్తాం.

- ఇలాంటి వ్యక్తులను జిల్లా బహిష్కరణకు కూడా చర్యలు తీసుకుంటాం.

... జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.

డైలీ భారత్ ,సూర్యాపేట:శుక్రవారం రాత్రి సూర్యాపేట పట్టణ శివారు కుసుమవారిగూడెం వద్ద హోటల్ లో ఒక రౌడి షీటర్ ను కొంత మంది రౌడి షీటర్, హిస్టరీ సీటర్స్ కలిసి కత్తులతో చేసిన హత్యకు సంభందించి సూర్యాపేట DSP, CCS CI, సూర్యాపేట రూరల్ CI మరియు SI కు టీం గా ఏర్పడి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని 10 మంది నేరస్తులను సూర్యాపేట రూరల్ పోలీసులు అరెస్టు చేయడం జరిగినది. మొత్తం 12 మంది పై కేసు నమోదు చేశాం. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నర్సింహ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు మరియు అరెస్టు వివరాలను వెల్లడించారు. హత్యకు సంబంధించిన సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు హత్య కేసు నమోదు చేసి మూడు టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు నమ్మదగిన సమాచారం పై నిందితులను గుర్తించి ఈరోజు 10 మందిని సూర్యాపేట పట్టణంలో నింధితుల నివాసాల వద్ద అరెస్టు చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ కి చెందిన మృతుడు చారగండ్ల శివ నిందితుడు పెద్ది లింగస్వామి ఇద్దరు సహచరులు వీరికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, అనుచరులతో  గోడవలు ఉన్నాయి, మృతున్ని పథకం ప్రకారం ఇంటి నుండి బయటి రప్పించి హత్య చేశారు. 

శాంతియుత సమాజంలో ఇలాంటి వ్యక్తులను జిల్లా పోలీస్ శాఖ పూర్తిగా నిరోధిస్తుందని ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని, సమాజంలో అభద్రతభవాం సృష్టించే వ్యక్తులపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పీడియాక్ట్ సైతం నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఉన్న రౌడీషీటర్లకు జిల్లా పోలీస్ శాఖ కఠినంగా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నదని ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని, వర్గపోరు, గ్రూప్ దాడులకు పాల్పడే వారిని జిల్లా బహిష్కరణకు కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

 ఏ-1 తో ఏ-5 లను కేసారం గ్రామంలో సతీశ్ ఇంటిదగ్గర , ఏ-6 తో ఏ-8  లను అన్నాదురై నగర్ లోని లింగస్వామి ఇంటి దగ్గర , ఏ-9 & ఏ-10 లను వల్ల ఇంటి దగ్గర తేదీ 29.09.2025 నాడు 1100 గంటల కి పట్టుబడి చేయనైనది. 

హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్లు పరోక్షంగా పాల్గొన్న వాళ్లు మొత్తం 12 మంది ఉన్నారు, ఇందులో ప్రధాన నిందితుడు మాతంగి మధు అలియాస్ కర్రె మధు ఇతడు ఎన్టీఆర్ కాలనీ మృతునిపై కత్తితో దాడి చేశాడు, పెద్ది లింగస్వామి ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు అన్నాదురై నగర్ ఇతడు మృతునిపై కత్తితో దాడి చేశాడు, చెవుల నరేష్ క్యాటరింగ్ పనిచేస్తాడు ఇతడు మృతునిపై కత్తితో దాడి చేశాడు, జెక్కి సతీష్ అనే నిందితుడు మృతునిపై గొడ్డలితో దాడి చేస్తాడు, కేసారం సతీష్ ఇతనిది కేసారం గ్రామము మృతుని దాడి చేశాడు. నేరెళ్ల శ్రీరాములు మరియు గువ్వల తరుణ్ కుమార్ మృతునికి దగ్గరగా ఉంటూ నమ్మించి ఇతని యొక్క సమాచారాన్ని ప్రధాన నిందితులకు చేరవేస్తారు. సూరా రామచంద్రు చింతపల్లి వెంకటేష్ ఇద్దరు నేరస్థులకు సహాయం చేస్తూ సంఘటన వద్ద బయట ఉండి నేరస్తులు తప్పించుకోవడానికి బండి మీద సహాయం చేశారు, జెల్ల ఉదయ్ కుమార్ ఇతను మృతుని వెంట ఉంటూ నేరం గురించి తెలిసి నేరం జరిగే క్రమంలో అక్కడి ను ది వెళ్ళిపోయి నేరస్తులు పారిపోవడానికి సహాయం చేశారు. అలాగే జక్కి అనిల్ కూడా నేరస్తులకు సహాయం అందిస్తాడు. వర్రె రామకృష్ణ అనే నిందితుడు గతంలో నాగారంలో సుఫరి హత్యకేసులో సుఫారి ఇచ్చాడు, ఇతను నేరస్తులకు కావాల్సిన కత్తులు ఆయుధాలు సరఫరా చేశాడు.

సుమారు ఐదు సంవత్సరాల క్రితం సూర్యాపేట టౌన్ కు చెందిన పెద్ది లింగస్వామి, కు మరియు మృతుడు భర్త చారగండ్ల శివకుమార్ @ శివ, వ. 29 సం.లు  గొడవ జరుగగా, అన్నదురై నగర్ కు చెందిన  పెద్ది లింగస్వామి ప్లవర్ డేకరేష్ చేస్తాడు (ఇతనిపై కేసులు ఉన్నాయి) మృతునిపై హత్య యత్నం చేసినాడు. అట్టి సమయములో పెద్ది లింగస్వామి పై కేసు అయినది,  అప్పటి నుండి పెద్ది లింగస్వామి మృతునిపై పగ పెంచుకున్నాడు. తేదీ 26.09.2025 రోజు మధ్యాహ్నం చారగండ్ల శివ మృతునికి మరియు పెద్ది లింగస్వామి కి సూర్యాపేట పూల సెంటర్ వద్ద గొడవ అయినది, పెద్ది లింగస్వామి పాత కక్షలు మనసులో పెట్టుకొని, తన స్నేహితులు అయిన మాతంగి మధు, వారి స్నేహితులు కొంత మంది కలిసి మృతుణ్ణి హత్య చేయాలని ప్లాన్ వేసి, పథకం ప్రకారం మాతంగి మధు తో సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో మృతునికి ఫోన్ చేయించి కుసుమవారిగూడెం వైన్ షాప్ దగ్గర గొడవ అవుతున్నది మాట్లాడేది ఉన్నది రమ్మని పిలువగా, మృతుడు అక్కడకు వెళ్ళి రాత్రి సుమారు 10.10 గంటల సమయంలో కుసుమ వారి గూడెం భీమారంరోడ్డు లో వైన్ షాప్ ఎదురుగా ఉన్న విజయ్ హోటల్ వద్ద మందు తాగుతుండగా నేరస్తులు పెద్ది లింగస్వామి, వ. 28 సం.లు, అతని స్నేహితులు మాతంగి మధు, మరియు వారి స్నేహితులు కొంత మంది కలిసి మారణాయుధాలతో దాడి చేసి, కత్తులు మరియు  గొడ్డళ్లతో తలపై విచక్షణా రహితంగా నరికి చంపినారు. మృతుని భార్య చారగండ్ల అఖిల భర్త శివకుమార్ @ శివ, వయస్సు 25 సం.లు, వృత్తి గృహిణి,  R/o ఇందిరమ్మ కాలనీ ఫేస్ 1,  సూర్యాపేట టౌన్ ఫిర్యాదు మేరకు N. బాలు నాయక్ SI సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు పరిచినారు. SP పర్యవేక్షణ లో  సూర్యపేట DSP  V. ప్రసన్న కుమార్  పరిశోధన చేసి, నిందితులను ఏ-1 to  ఏ-10 లను  సూర్యాపేట రూరల్  సి.ఐ. G. రాజశేఖర్ & సూర్యాపేట రూరల్  యస్ .ఐ.  ఎన్. బాలు నాయక్ ల సహాయంతో కేసారం గ్రామం లో సతీశ్ ఇంటి దగ్గర 5 గురిని , అన్నాదురై నగర్ లో  లింగస్వామి ఇంటి దగ్గర 3 గురిని , వెంకటేష్ మరియు ఉదయ్ వల్ల ఇంటిదగ్గర పట్టుకొని విచారణ చేసి వారి దగ్గర నుండి నేరంలో ఉపయోగించిన ఆయుధాలను మరియు వినియోగించిన వాహనాలను మరియు దుస్తులను స్వాదీనపరచుకొనైనది . మరియు ఇట్టి నేరస్తులను ఈ రోజు 29.09.2025 నాడు ఉదయమ్ 11.00 గంటలకు పట్టుబడి చేసి తదుపరి న్యాయాస్తానం లో హాజరు పరచడం జరుగుతుంది.  

నేరస్థుల  వివరాలు :

A-1) మాతంగి మధు @ కర్రే మధు, వ. 27 సం.రాలు, వృత్తి: రాడ్ బెండింగ్ వర్క్, నివాసం. మాధారం గ్రామం, మునగాల మండలం. ప్రస్తుత నివాసం. ఎన్‌టి‌ఆర్ కాలనీ,  సూర్యపేట్ టౌన్.

A-2) పెద్ది లింగస్వామి, వ. 28 సం.లు, వృత్తి: ఫ్లవర్ డెకొరేషన్ వర్క్,  నివాసం. అన్నాదురై నగర్, సూర్యపేట్ టౌన్.

A-3) చెవుల నరేశ్ వయసు: 27 సం.లు, వృత్తి: కాటరింగ్ వర్క్, నివాసము: సీతారాంపురం, సూర్యపేట్ టౌన్. 

A-4) జక్కి సత్తి @ సతీష్ @ టిప్పర్ సత్తి, వయసు: 33 సం.లు, వృత్తి: కాటరింగ్ వర్క్, నివాసము: జే‌జే నగర్, సూర్యపేట్ టౌన్. 

A-5)  బాషిగుంపుల @ కేసారం సతీష్, వయసు: 28 సం.లు, వృత్తి: డ్రైవరు, నివాసము: కేసారం గ్రామం, సూర్యపేట్ మండలం. 

A-6)  నేరెళ్ళ శ్రీరాములు @ శ్రీరామ్ తండ్రి శ్రీను, వయసు: 24 సం.లు, వృత్తి: కాటరింగ్ వర్క్, నివాసము: తాళ్ళగడ్డ, సూర్యపేట్ టౌన్. 

A-7) గువ్వల తరుణ్ కుమార్ @ కిట్టు, వయసు: 25 సం.లు, వృత్తి:  టిఫిన్ సెంటర్, నివాసము: అన్నాదురై నగర్, సూర్యపేట్ టౌన్. 

A-8) సూర రామచంద్రు @ Y.S, వయసు: 25 సం.లు, వృత్తి:  ప్లంబర్ వర్క్, నివాసము: కేసారం గ్రామం, సూర్యపేట్ మండలం. 

A-9) చింతపల్లి వెంకటేష్, వయసు: 20 సం.లు, వృత్తి:  హోటల్ వర్క్, నకిరేకల్, నివాసము: అయిటిపాముల గ్రామం, కట్టంగూర్ మండలం, నల్గొండ జిల్లా. 

A-10)  జెల్ల ఉదయ్ కిరణ్, వయసు: 24 సం.లు, వృత్తి: పెయింటింగ్ వర్క్, నివాసము: ఇందిరమ్మ కాలనీ ఫేస్-II, సూర్యపేట్ టౌన్. 

A-11) జక్కి అనిల్, వయసు: 24 సం.లు, వృత్తి: స్టూడెంట్ నివాసము: జే‌జే నగర్, సూర్యపేట్ టౌన్. ( పరారీ లో ఉన్నాడు ) 

A-12) వర్రే రామకృష్ణ  నివాసము: కృష్ణ టాకీస్ దగ్గర, సూర్యపేట్ టౌన్. ( పరారీ లో ఉన్నాడు ) 

గత నేర చరిత్ర. 

నేరస్థులు గతంలో సూర్యపేట మరియు ఖమ్మం జిల్లాలో పలు నేరాలలో పాల్గొని ఉన్నారు. 

1) మాతంగి మధు @ కర్రే మధు పైన 9 కేసులు మరియు సూర్యపేట టౌన్ పి.యస్. లో రౌడీ షీట్ కలదు.

2) పెద్ది లింగస్వామి పై 5 కేసులు, 

3) జక్కి సత్తి @ సతీష్ @ టిప్పర్ సత్తి పై 3 కేసులు, మరియు సూర్యపేట టౌన్ పి.యస్. లో రౌడీ షీట్ కలదు.

4) చెవుల నరేశ్ పై 4 కేసులు మరియు సూర్యపేట టౌన్ పి.యస్. లో  సస్పెక్ట్  షీట్ కలదు.

5) బాషిగుంపుల సతీశ్ @ కేసారం సతీష్ పైన 1 కేసు  , 

6) నేరెళ్ళ శ్రీరాములు @ శ్రీరామ్ పై 4 కేసులు, మరియు సూర్యపేట టౌన్ పి.యస్. లో  గంజా సస్పెక్ట్  షీట్ కలదు.

 7)  చింతపల్లి వెంకటేష్ పై 2 కేసులు, 

8) జల్ల ఉదయ్ కిరణ్ పైన 2 కేసులు

Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >