| Daily భారత్
Logo




పోలీసులకు వార్నింగ్... మమ్మల్ని ఎవరూ ఆపలేరు..

News

Posted on 2025-10-01 13:22:48

Share: Share


పోలీసులకు వార్నింగ్... మమ్మల్ని ఎవరూ ఆపలేరు..

మా కోసం వెతకొద్దంటూ హెచ్చరిక

డైలీ భారత్,ఇంటర్నెట్ డెస్క్: ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. వారిని అరెస్ట్ చేసి చూపిస్తామని పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్ ఐబొమ్మకు మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు  ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో బదులిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు.

ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అని ఆ మెసేజ్ లో ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారని పేర్కొంది. అంతేకాక మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. మా వెబ్‌ సైట్‌ ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయటపెడతాం అని వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుందని పేర్కొంది. రూ. 5 కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేయగలమని హెచ్చరికలు జారీ చేసింది.

5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మీడియా, ఓటీటీ, హీరోలకూ షాకింగ్‌ వార్త రివీల్ అవుతుంది. ప్రతి యూజర్ ఫోన్ నంబర్‌ మా డేటాబేస్‌ లో నిక్షిప్తమై ఉంది. దేశం మొత్తంలో మా సపోర్ట్ ఉంది. మా వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే - మీరే ఎక్స్‌ పోజ్ కు గురవుతారు. ఫ్యాన్స్‌ కు సీక్రెట్‌ గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతామని పేర్కొంది.

కొన్ని ప్రొడక్షన్ హౌజ్‌ లు, యూట్యూబ్ ఛానళ్లు ఉద్దేశపూర్వకంగా ఐ బొమ్మను తప్పుగా ప్రచారం చేస్తున్నాయని, తాము ఎలాంటి హ్యాకింగ్, ఫోన్ ట్రాకింగ్ చేయబోమని మరోసారి హామీ ఇచ్చింది. అలాగే తమది ఒక భారతీయ సైట్ అని, తెలుగు ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉన్నామని ఐ బొమ్మ స్పష్టం చేసింది. హీరోలకు వందల కోట్లు రెమ్మునరేషన్ ఇచ్చి.. భారీ బడ్జెట్ లు చూపించి సామాన్య ప్రేక్షకులపై ఆ ప్రభావం చూపుతున్నారని ఐ బొమ్మ మండిపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ గా మారింది. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >